E-Paper
Advertisement

IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే
Advertisement

IPL 2026 2nd phase schedule:  క్రికెట్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటుకు  ( Indian Premier League 2026 Tournament) సంబంధించిన రెండో ఫేజ్ షెడ్యూల్ ( IPL 2026 2nd phase schedule) విడుదలైంది. ఈ మేరకు బీసీసీఐ ( BCCI) కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మొదటి దశ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ, ఏప్రిల్ 13వ తేదీ నుంచి రెండవ దశ  షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు మొత్తం 50 లీగ్ మ్యాచ్ లో జరగనున్నట్లు పేర్కొంది. అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్స్ షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

Also Read : Fans On Mohsin Naqvi: న‌ఖ్వీ పెద్ద మోస‌గాడు..PSL టికెట్ల రిఫండ్ డ‌బ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్

IPL రెండో ఫేజ్ షెడ్యూల్ వచ్చేసింది

Advertisement

ఐపీఎల్ క్రికెట్ షెడ్యూల్ పై బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే మార్చి 28వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుండగా, మొదటి దశ షెడ్యూల్ వచ్చింది. మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొదటి దశ ఐపిఎల్ టోర్నమెంట్ కొనసాగనుంది. ఇక ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు రెండవ దశ షెడ్యూల్ కొనసాగుతున్నట్లు మ్యాచ్ ల లిస్టు రిలీజ్ చేసింది బీసీసీఐ. మొదటి దశలో 20 మ్యాచ్ లు జరగనుండగా, ఈ రెండవ దశలో మాత్రం ఏకంగా 50 లీగ్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.

అంటే లీగ్ దశలో దాదాపు 70 మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం 12 వేదికలలో ఈ మ్యాచ్ లను నిర్వహించబోతున్నారు. అయితే ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ ల షెడ్యూల్ అలాగే వేదికలు త్వరలోనే ప్రకటించనున్నట్లు బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే లీగ్ దశ మ్యాచ్ లు మాత్రం జరగనున్నట్లు పేర్కొంది. కేరళం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎండాకాలంలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల కారణంగా మ్యాచులకు ఎలాంటి డిస్టర్బ్ జరగకుండా దశల వారీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 షెడ్యూల్ ప్రకటిస్తోంది బీసీసీఐ. కాగా ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ తొలి మ్యాచ్ మార్చి 28న హైద‌రాబాద్ వ‌ర్సెస్ ఆర్సీబీ మ‌ధ్య జ‌రుగ‌నుంది.

ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మ‌నీ ర‌ద్దు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మరో అప్డేట్ కూడా బీసీసీఐ ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ 2026 ఓపెనింగ్ సెర్మని ఉండబోదని తెలిపింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ప్రతిసారి ఓపెనింగ్ సెర్మని నిర్వహించామని, కానీ ఈసారి నిర్వహించలేకపోతున్నట్లు పేర్కొంది. అభిమానులు తమ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరింది.

Also Read : Rajasthan Royals Sold: ప‌నికిరాని షేర్లు కొని, త‌న పిల్లలకు రూ.460 కోట్ల ఆస్తి సంపాదించిన షేన్ వార్న్..సన్నాఫ్ సత్యమూర్తి రేంజ్ లో

 

 

 

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×