E-Paper
Advertisement

IPL 2026 New Rule: ఐపీఎల్ 2026లో 3.5 గంట‌ల‌ రూల్, ఇకపై వాళ్ల ఆట‌లకు చెక్ !

IPL 2026 New Rule: ఐపీఎల్ 2026లో 3.5 గంట‌ల‌ రూల్, ఇకపై వాళ్ల ఆట‌లకు చెక్ !
Advertisement

IPL 2026 New Rule:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో 10 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారైంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఇప్పటికే మొదటి దశ షెడ్యూల్ రిలీజ్ చేసింది బీసీసీఐ. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) మధ్య తొలి మ్యాచ్ చిన్న స్వామి స్టేడియం (Chinna Swamy Stadium) వేదికగా జరగనుంది. అయితే ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంటులో కొత్త రూల్స్ తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ సీజన్ లో మూడున్నర గంటల నియమాన్ని ( three-and-a-half-hour rule) ప్రవేశపెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ రూల్ కేవలం ఫ్ల‌డ్ లైట్స్ కింద ప్రాక్టీస్ చేసే మ్యాచ్ ల‌కు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

ఐపీఎల్ 2026లో 3.5 గంట‌ల‌ రూల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో 10 జట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ సీజన్ నుంచి మూడున్నర గంటల నియమాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటన చేసింది. ఈ రూల్స్ ప్రకారం ఫ్లడ్ లైట్స్ వెలుతురు కింద ఏదైనా ప్రాక్టీస్ మ్యాచ్ జరిగితే, మూడున్నర గంటల్లోపే ఆ మ్యాచ్ ఫినిష్ చేయాలి. లేకపోతే బీసీసీఐ వేటు వేస్తుంది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేటప్పుడు మెయిన్ పిచ్ పైన అస్సలు ఆడకూడదు.

సైడ్ వికెట్ల పైన మాత్రమే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ లో మెయిన్ మ్యాచ్ ఆడే కంటే ముందు, ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్లో ఎక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగిన కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి పర్మిషన్లు జట్ల ఓనర్లు తీసుకోవాలి. పైన రూల్స్ అమలు చేస్తేనే ప్రధాన పిచ్ లు టోర్నమెంట్ కు అనుకూలంగా ఉండి, ఎలాంటి సమస్యలు రావని భారత క్రికెట్ నియంత్రణ మండలి భావిస్తోంది. అందుకే ఈ 3.5 గంటల రూల్ తెరపైకి తీసుకువచ్చింది బీసీసీఐ.

Advertisement

ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి దశ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు మొత్తం 20 మ్యాచ్లు జరుగుతాయి. అంటే ఒక్కో జట్టు నాలుగు మ్యాచ్లు ఆడుతుంది. అతి త్వరలోనే పూర్తిస్థాయిలో షెడ్యూల్ కూడా విడుదల చేయనుంది బీసీసీఐ. ఇండియాలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్ వాయిదా వేసింది.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×