E-Paper
Advertisement

Aditya Dhar: రిలీజ్‌కు ముందు ‘ధురంధర్ 2’ దర్శకుడు ఎమోషనల్.. అంచనాలతో మాత్రం వెళ్లకండి..

Aditya Dhar: రిలీజ్‌కు ముందు ‘ధురంధర్ 2’ దర్శకుడు ఎమోషనల్.. అంచనాలతో మాత్రం వెళ్లకండి..
Advertisement

Aditya Dhar: రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందిరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న ‘ధురంధర్ : ది రివేంజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 19, 2026న విడుదల కానుంది. ఇప్పటికే ప్రీమియర్లు సందడి చేయాల్సి ఉండగా హిందీ తప్పితే మిగిలిన అన్ని భాషలకు సంబంధించి ప్రీమియర్లు క్యాన్సిల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ఆదిత్యధర్ పోస్ట్ చేసిన నోట్ అందిరినీ ఆశ్యర్యానికి గురించేస్తుంది. ఈ సినిమా విషయంలో ఎవరూ అంచనాలతో వెళ్ల వద్దంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దీనికి సంబంధించి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ నోట్ లో ఆయన ఏం చెప్పుకొచ్చారంటే?.. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అనుభూతి. ముఖ్యంగా భారీ అంచనాలున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాల విషయంలో ఆ అనుభూతి చెడకుండా ఉండాలంటే ‘సస్పెన్స్’ చాలా ముఖ్యం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో సినిమా విడుదలైన నిమిషాల్లోనే ‘స్పాయిలర్స్’ (Spoilers) బయటకు వచ్చేస్తున్నాయి. దీనివల్ల థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకుడి ఉత్సాహం దెబ్బతింటోంది. అంటూ ‘ధురంధర్ 2’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకులకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేశారు.

Read also-Ustaad Bhagat Singh: ఉస్తాద్ హైలెట్స్.. వీటి కోసమైనా సినిమా చూడాల్సిందే!

ట్విస్ట్‌లను రివీల్ చేయకండి!

Advertisement

తమ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar The Revenge) కోసం చిత్ర యూనిట్ ప్రాణం పెట్టి పనిచేసిందని ఆదిత్య తెలిపారు. సినిమాలో ప్రేక్షకులు ఊహించని ఎన్నో మలుపులు, భావోద్వేగభరితమైన సన్నివేశాలు ఉన్నాయని, వాటిని ముందే బయటపెట్టవద్దని ఆయన కోరారు. “సినిమాలోని ట్విస్ట్‌లు కీలకమైన అంశాలను ఎవరికీ షేర్ చేయవద్దు. ప్రతి ఒక్కరూ ఎటువంటి ముందస్తు అంచనాలు లేకుండా, క్లూలెస్‌గా థియేటర్‌కు వెళ్లి ఆ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను,” అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సినిమాను మొబైల్ ఫోన్లలో చిన్న తెరపై చూడటం కంటే, థియేటర్‌లో వందల మంది మధ్య కూర్చుని చూసినప్పుడే ఆ కిక్కు వేరని ఆయన గుర్తుచేశారు. ఈ సినిమాలోని ప్రతి ట్విస్ట్‌ను, ప్రతి ఎమోషన్‌ను ప్రేక్షకులు థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Read also-YouTuber Vaishnavi Case: యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

అభిమానులపై నమ్మకంతో..

Advertisement

గతంలో ‘ఉరి’ (Uri) సినిమాను ఏ విధంగానైతే ప్రేక్షకులు గుండెలకు హత్తుకున్నారో, అదే స్థాయిలో ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సినిమా కథను, అందరి శ్రమను గౌరవించి, స్పాయిలర్స్ స్ప్రెడ్ చేయకుండా సినిమా విజయంలో భాగస్వాములు కావాలని ఆదిత్య ధర్ కోరారు. ఒక దర్శకుడు ఇంతలా విన్నవిస్తున్నారంటే, ‘ధురంధర్’లో ఏదో భారీ సర్ప్రైజ్ దాగి ఉందని అర్థమవుతోంది. మరి ఈ సస్పెన్స్‌ను ప్రేక్షకులు ఎంతవరకు కాపాడుతారో చూడాలి. ఈ సినిమా ప్రీమియర్లు లేకపోవడంలో తెలుగు, తమిళం, కన్నడ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మార్చి 19, 2026న విడుదలై ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×