Pakistan-no ball: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ( Pakistan) అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పటికీ ఏదో ఒక వివాదంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు చిక్కుకుంటూ ఉంటుంది. లేటెస్ట్ గా బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్తాన్ జట్టును, క్రికెట్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ సంఘటన మరువక ముందే, పాకిస్తాన్ పరువు పోయేలా ఓ నో-బాల్ సంఘటన హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ దేశవాళీ క్రికెట్ జట్టుకు సంబంధించిన అసద్ అక్తర్ ( Asad Akhtar ) అనే బౌలర్ క్రీజు నుంచి అర మీటర్ అవతల నో బాల్ సంధించాడు. దీంతో మహమ్మద్ అమీర్ ( Mohammed Amir ) గతంలో వేసిన నో బాల్ ను ( no-ball ) గుర్తు చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.
నేషనల్ టి20 టోర్నమెంట్ లో భాగంగా లాహోర్ బ్లూస్ వర్సెస్ కరాచీ బ్లూస్ ( Lahore Blues vs Karachi Blues ) జట్ల మధ్య మ్యాచ్ తాజాగా జరిగింది. ఈ మ్యాచ్ పెషావర్ లోని ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా అయితే కరాచీ బ్లూస్ తరఫున బరిలోకి దిగిన బౌలర్ అసద్ అక్తర్ ఓ భయంకరమైన నో-బాల్ వేశాడు. బౌలింగ్ వేసే క్రమంలో క్రీజుకు అర కిలోమీటర్ దూరంలో అతని కాలు పడింది. దీంతో నో-బాల్ గా అంపైర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.
ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా పాకిస్తాన్ క్రికెటర్లను ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇయర్ ఆఫ్ ద నో-బాల్ అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. లాహోర్ బ్లూస్ జట్టు గెలవాలని ఇలా కావాలనే నో- బాల్ వేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇదే మ్యాచ్ లో ఈ అసద్ అక్తర్ ఒకే ఓవర్ లో 21 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పక్కాగా ఫిక్సింగ్ జరిగిందని క్రీడా అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.
నేషనల్ టి20 కప్ లో పాకిస్తాన్ దేశవాళి క్రికెటర్ అసద్ అక్తర్ వేసిన నో- బాల్ ను అప్పట్లో మహమ్మద్ అమీర్ వేసిన నో-బాల్ తో పోల్చుతున్నారు. గతంలో లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుపై కూడా అచ్చం ఇలాగే మహమ్మద్ అమీర్ కూడా నో-బాల్ వేశాడు. దీంతో మహమ్మద్ అమీర్ ( Mohammed Amir) ఫిక్సింగ్ కు ( Match Fixing) పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత అతని కెరీర్ అంతమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలాగే అసద్ అక్తర్ ను ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై పాక్ ప్రధాని సీరియస్ !
?igsh=MWlxbjJ3dHoyazh1eA==
Fixing suspicion?
That no-ball from Asad Akhtar in Pakistan’s National T20 Cup wasn’t just big, it was alarmingly big. This ball instantly brings back memories of the infamous no-ball from Mohammad Amir during the spot-fixing scandal.
Then there were two wides and two no-balls… pic.twitter.com/wk25tZZWZO
— Vipin Tiwari (@Vipintiwari952) March 15, 2026