BCCI Against Kyle Jamieson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 40కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) ఔట్ చేసిన తర్వాత అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ (Kyle Jamieson). కళ్ళు పెద్దగా పెట్టి, గట్టిగా అరుస్తూ మీద పడిపోయాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. అతనిపై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals vs Delhi Capitals) మధ్య నిన్న మ్యాచ్ జరగగా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని ర్యాగింగ్ చేశాడు ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్. అతన్ని ఔట్ చేసిన తర్వాత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నోరు తెరిచి మరి భయంకరమైన సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే ఒక 15 ఏళ్ల కుర్రాడిని పట్ల ఇలా వ్యవహరించడం పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. అతనిపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది బీసీసీఐ. ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ కు ఒక డిమెరిట్ పాయింట్ విధించింది.
కైల్ జేమీసన్ (Kyle Jamieson) ఐపీఎల్ ( IPL) కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.5 నిబంధనను ఉల్లంఘించినట్లు వెల్లడించింది బీసీసీఐ (BCCI). దీని ప్రకారం సహచర ఆటగాళ్లను కించపరచడం… రెచ్చగొట్టడం నిషేధం. ఈ రూల్ ప్రకారం కైల్ జేమీసన్ పై యాక్షన్ తీసుకుంది బీసీసీఐ. భారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నందుకు గాను ఇలాంటి వాళ్లకు తగిన శాస్తి జరిగిందని చురకలు అంటిస్తున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మధ్య జైపూర్ వేదికగా నిన్న మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 19.1 వలలో మూడు వికెట్ల నష్టానికి 226 పరుగులు సాధించింది.
Also Read: PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
🚨 FINE FOR KYLE JAMIESON 🚨
– Kyle Jamieson has been warned and handed one Demerits points for aggressive celebration against 15-Years old Vaibhav Suryavanshi. pic.twitter.com/SgcSFneqYb
— Cricket Central (@CricketCentrl) May 2, 2026