Ramiz Raja Hug: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) తుది దశకు వచ్చేసింది. మరో రెండు మ్యాచ్లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఎలిమినేటర్ వన్ ఇప్పటికే పూర్తి కాగా… ఎలిమినేటర్ 2 అలాగే ఫైనల్స్ జరగనున్నాయి. అయితే నిన్న ఎలిమినేటర్ 1 ( PSL 2026 Eliminator 1
) జరిగిన సందర్భంగా ఓ ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ ( Multan Sultans vs Hyderabad Kingsmen, Eliminator 1) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగానే రమీజ్ రాజా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లిసా స్తాలేకర్ ( Lisa Sthalekar) కామెంట్రీ బాక్స్ లో మాట్లాడుకుంటూ హగ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు కిస్ కూడా రమీజ్ రాజా ( Ramiz Raja) ఇచ్చినట్టు ఒక ఫోటో వైరల్ గా మారింది. ఈ సంఘటనపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజెన్స్ ఆగ్రహం కూడా చేస్తున్నారు. ఇది క్రికెట్ అనుకున్నారా..? లేక ముద్దులు హగ్గుల పోటీ అనుకుంటున్నారా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament) పోటీగా వచ్చిన పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ( Pakistan Super League 2026 Tournament ) రోజుకో షాకింగ్ సంఘటన జరుగుతూనే ఉంది. బుధవారం ఎలిమినేటర్ వన్ మ్యాచ్ లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ హైదరాబాద్ కింగ్స్ మెన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కింగ్స్ మెన్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ముల్తాన్ సుల్తాన్స్ మొదటి బ్యాటింగ్ చేసి 20 ఓవర్లు ఆడింది.
ఈ క్రమంలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ముల్తాన్ సుల్తాన్స్ జట్టు… 159 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అదరగొట్టింది హైదరాబాద్. 15.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేదించింది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మహిళ యాంకర్ లిసా స్తాలేకర్ ( Lisa Sthalekar) అలాగే రమీజ్ రాజా ( Ramiz Raja Kisses) కామెంటరీ బాక్సులు కూర్చున్నారు. ఈ తరుణంలోనే ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. అలాగే లిసా స్తాలేకర్ ను రమీజ్ రాజా కిస్ చేసినట్లు కూడా ఓ ఫోటో బయటకు వచ్చింది. దీంతో ఇద్దరు పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ కామెంట్రీ పేరుతో రొమాన్స్ చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
?igsh=MTJuYm14OGIzeHkyOQ==
Matter of Camera otherwise no one was stopping him pic.twitter.com/sbKPUglKPD
— Only INDIA Matters 🇮🇳 (@KKRmatters) April 30, 2026