E-Paper
Advertisement

ఇల్లు సెగలు కక్కుతోందా? మెయిన్ విలన్స్ కిటికీలే.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు!

ఇల్లు సెగలు కక్కుతోందా? మెయిన్ విలన్స్ కిటికీలే.. ఈ పొరపాట్లు అస్సలు చేయెుద్దు!
Advertisement

Summer Heat Tips: సాధారణంగా కిటికీలు లేని ఇల్లు ఉండదు. ప్రతీ ఇంట్లోనూ ఏదోక మూలన కిటికీలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే మిగతా కాలాల్లో ఎలా ఉన్నా వేసవిలో మాత్రం ఈ కిటికీల వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఇంట్లో ఏసీ, కూలర్ ఉన్నప్పటికీ.. ఉక్కపోత ఇంటిని చుట్టేయడం ఖాయమని పేర్కొంటున్నారు. కిటికీలను తప్పుడు సమయంలో తెరవడం వల్లే వచ్చే వేడిగాలి.. లోపలే ఏ విధంగా ఉండిపోతుందో ఇప్పుడు చూద్దాం.

బయటి ఉష్ణోగ్రత ప్రభావం

పగటిపూట బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కిటికీలు తెరిస్తే బయట ఉన్న వేడి గాలి నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది. గాలి ప్రవాహం బాగుందని మనం అనుకున్నప్పటికీ అది వాస్తవానికి ఇంటి లోపల ఉష్ణోగ్రతను పెంచుతుంది.

థర్మల్ మాస్ (Thermal Mass)

Advertisement

బయటి నుంచి వచ్చే వేడి గాలి ఇంటి గోడలు, ఫర్నిచర్, నేలను వేడెక్కిస్తాయని నిపుణులు అంటున్నారు. దీనినే ‘థర్మల్ మాస్’ అంటారని స్పష్టం చేస్తున్నారు. ఒకసారి ఇవి వేడెక్కిన తర్వాత గాలి చల్లబడినప్పటికీ అవి వేడిని నెమ్మదిగా విడుదల చేస్తూనే ఉంటాయని.. దీనివల్ల రాత్రి అయినా కూడా ఇల్లు సెగలు గక్కుతున్నట్లే అనిపిస్తుందని వివరిస్తున్నారు.

గాలి ప్రసరణ లేకపోవడం

కేవలం ఒక వైపు కిటికీలు తెరిచి ఉంచితే వేడి గాలి లోపలికి వచ్చి ఇంట్లోనే ఉండిపోతుంది. సరైన గాలి ప్రసరణ (Cross Ventilation) లేకపోతే.. ఆ వేడి బయటకు వెళ్లడానికి మార్గం ఉండదు. ఫలితంగా ఇల్లు ఆటోమేటిక్ గా వేడెక్కి.. అసౌకర్యంగా మారుతుంది.

కిటికీలు ఎప్పుడు తెరిస్తే బెటర్?

Advertisement

సూర్యుడు అస్తమించిన తర్వాత ఆటోమేటిగ్గా బయటి ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఆ సమయంలో కిటికీలు తెరిస్తే చల్లని గాలి లోపలికి వస్తుంది. అలాగే ఉదయం ఎండ తీవ్రత పెరగకముందే కిటికీలు తెరిచి ఉంచడం వల్ల కూడా ఇల్లు చల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఈ టెక్నిక్ పాటిస్తే.. ఆ సమయంలో ఏసీలను ఆన్ చేయాల్సిన అవసరమే ఉండదని స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఏసీ అవుట్ డోర్ యూనిట్ అతిగా వేడెక్కుతోందా? అయితే మూడినట్లే.. వెంటనే ఇలా చేయండి!

ఎప్పుడు మూసి ఉంచాలి?

వేసవిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విపరీతమైన ఎండ ఉంటుంది. ఆ సమయంలో కిటికీలు తెరవడం అస్సలు మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కిటికీలను క్లోజ్ చేయడంతో పాటు బయటి వేడి లోపలికి రాకుండా కర్టెన్లు అడ్డుపెడితే మంచిదని సూచిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: విద్యుత్ సరఫరాలో లోపాలు.. సీఎం రేవంత్ అసహనం.. అధికారులకు వార్నింగ్!

Related News

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×