E-Paper
Advertisement

Dhoni:- ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. మరో రెండు సీజన్లు ఆడడం కన్ఫార్మ్

Dhoni:- ధోనీ ఫ్యాన్స్‌కు బిగ్ గుడ్ న్యూస్.. మరో రెండు సీజన్లు ఆడడం కన్ఫార్మ్
Advertisement

Dhoni:- మహేంద్ర సింగ్ ధోనీ వయసు 41 ఏళ్లు. ఈ వయసులో బ్యాటింగ్ చేయడం ఒకింత కష్టమే. పైగా కీపింగ్ బాధ్యతలు. ధోనీ ఒక్కడికే సాధ్యమేమో అనిపించేలా బాగానే ఆడుతున్నాడు. అసలు ధోనీ బ్యాట్ పట్టుకోకపోయినా ఫర్వాలేదు. గ్రౌండ్‌లో ఉంటే చాలు.. మ్యాచ్ విన్నింగ్‌కు అదే పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఫీల్డింగ్ లో ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, బ్యాట్స్‌మెన్‌ను బట్టి ఎవరితో ఎలాంటి బంతులు వేయించాలని అంచనా వేయడంలో ధోనీ దిట్ట. కెప్టెన్సీలో ధోనీని కొట్టే వారే లేరు. పైగా మిస్టర్ కూల్ కెప్టెన్. ధోనీ కెప్టెన్సీలో ఆడడం ఏ ఆటగాడికైనా మంచి ఉత్సాహాన్ని ఇచ్చేదే. అందుకే, మేనేజ్‌మెంట్ కూడా ధోనీకి వయసు మీద పడుతున్నా.. కొన్ని సార్లు విఫలమైనా కెప్టెన్ బాధ్యతలు ఇచ్చి మరీ ఆడిస్తోంది.

ఐపీఎల్ సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి అందరిలోనూ ఓ డౌట్. ఈసారి ధోనీ ఆడతాడా లేదా అని. గత రెండు సీజన్లలో అభిమానులకు ఇవే అనుమానాలు వచ్చాయి. అయితే, ధోనీ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ లో అడుగుపెట్టడంతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఈ సీజన్ లోనూ ఆడుతున్నాడు. మరి వచ్చే సీజన్ పరిస్థితి ఏంటి? అప్పటికి ధోనీకి 42 ఏళ్లు వస్తాయి. ఎంత మంచి ఆటగాడైనా.. ఆ వయసులో ఆడించడం సబబు కాదు. ఇదే బెంగ పట్టుకుంది అభిమానులకు.

Advertisement

కాని, ధోని మరో రెండు ఐపీఎల్ సీజన్స్‌లోనూ ఆడతాడంటున్నారు. వయసు మీద పడుతున్నా సరే.. ధోనీ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా ఆడతాడు. ఇదే విషయాన్ని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ధీమా వ్యక్తం చేశాడు. మొయిన్ అలీ చెప్పాడని కాదు గానీ.. నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ ఇప్పటికీ యమ చురుగ్గా ఉంటున్నాడు. కెప్టెన్సీ స్ట్రాటజీస్ తప్పడం లేదు. మొన్న రాజస్థాన్‌ రాయల్స్‌పై ధోనీ ఆడిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సో, ధోనీకి మరో రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడే అవకాశం సత్తా ఉందంటున్నారు. ఇలాంటి పాజిటివ్ టాక్స్ వస్తే.. జట్టు మేనేజ్ మెంట్ కూడా ధోనీ విషయంలో సానుకూలంగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. 

Tags

Related News

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

క్రికెట్ ఫ్యాన్స్ కు షాక్‌.. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు భారీ అడ్డంకి !

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

Big Stories

Advertisement
×