BigTV English

Sanju Samson:-ఇకనైనా టీమిండియాలోకి తీసుకోండి.. సంజూ శాంసన్‌కు పెరుగుతున్న మద్దతు

Sanju Samson:-ఇకనైనా టీమిండియాలోకి తీసుకోండి.. సంజూ శాంసన్‌కు పెరుగుతున్న మద్దతు

Sanju Samson:- సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. మంచి టాలెంటెడ్ ప్లేయర్. అవకాశాలు ఇవ్వాలే గానీ.. సత్తా చూపగల ఆటగాడు. టీమిండియాలో ఛాన్స్ ఇస్తే… ఈ పాటికి ఇంటర్నేషనల్ క్రికెట్లో సంజూ శాంసన్ పేరు మీద కొన్ని రికార్డులైతే తప్పనిసరిగా ఉండేవి. క్రికెట్ పండితులు, మాజీ ఆటగాళ్లు సైతం సంజూ శాంసన్ విషయంలో ఇదే పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉన్నారు.


రీసెంట్‌గా సంజూపై హర్షా భోగ్లే చేసిన కామెంట్ల కూడా నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. మొన్న గుజరాత్‌ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు సంజూ. ఒకవేళ బ్యాట్స్‌మెన్‌గా విఫలమైనప్పటికీ… రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు వరుస విజయాలు సాధించడంలో కెప్టెన్‌‌గా తన మార్క్ వేస్తున్నాడు. దీంతో ఇప్పటికైనా సంజూ శాంసన్‌ ను ఇప్పటికైనా గుర్తించాలంటున్నారు.

టీమిండియాలో ప్రస్తుతం పోటీ ఉన్న విషయం తెలిసిందే. అలాంటప్పుడు కనీసం ఇండియా తరపున టీ20 మ్యాచులల్లో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మొన్న గుజరాత్ పై జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో రాణించాడు సంజూ శాంసన్‌. 26 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన స్టేజ్ నుంచి జట్టుకు విజయం అందించేంత వరకు చాలా కష్టపడ్డాడు శాంసన్. దీంతో తన అద్భుతమైన ఆటతీరుతో సోషల్‌ మీడియాలో మరోసారి ట్రెండ్ అయ్యాయి. సంజూ శాంసన్ ను మళ్లీ జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే కూడా సంజూపై ఇంట్రస్టింగ్ ట్వీట్స్ చేశాడు. తనకే గనక పవర్స్ ఉంటే.. సంజూ శాంసన్‌ను భారత్‌ టీ20 జట్టు తరఫున ప్రతి రోజూ ఆడించే వాడిని అంటూ పోస్ట్ పట్టాడు. ఈ ట్వీట్ మరింత వైరల్‌గా మారింది. అటు క్రికెట్‌ అభిమానులు కూడా సంజూకు సపోర్టుగా కామెంట్లు పెట్టారు. ఒక్క బీసీసీఐ తప్ప భారత్‌ అంతా సంజూను కోరుకుంటోందని ట్వీట్స్ చేశారు. 

Tags

Related News

Travis head – SRH Fan : ఆస్ట్రేలియా గడ్డపై SRH ఫ్యాన్స్ రచ్చ చూడండి.. హెడ్ ను అడ్డంగా పట్టుకొని

IPL 2026 : SRH కోసం మరోసారి రంగంలోకి రజినీకాంత్?

World cup 2027: గిల్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ.. ఇంత దారుణమా?

Yash Dayal: RCB బౌలర్ దయాల్ కు ఎదురుదెబ్బ.. ఐపీఎల్ 2026 నుంచి ఔట్?

Jos Butler : ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఇక క్రికెట్ కు గుడ్ బై ?

Brian Lara : ముసలాడే కానీ మహానుభావుడు.. ఇద్దరు అమ్మాయిలతో లారా ఎంజాయ్ మామూలుగా లేదుగా

Big Stories

×