BigTV English

Sunrisers :- మరో విజయం కోసం హైదరాబాద్.. రూ.8.25 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టాలని ప్లాన్

Sunrisers :- మరో విజయం కోసం హైదరాబాద్.. రూ.8.25 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టాలని ప్లాన్

Sunrisers :- హ్యాట్రిక్ విజయం కోసం భారీగానే కసరత్తు చేస్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. మంగళవారం రోజు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడుతోంది. సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడం, ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో మొన్ననే మంచి విక్టరీ అందుకుంది ముంబై. ఈ రెండు జట్లు వరుస విజయాలతో దూకుడుగానే ఉన్నాయి. దీంతో మంగళవారం జరిగే మ్యాచ్ అమీతుమీ తేల్చుకునే లాగా ఉండబోతోంది.


హ్యారీ బ్రూక్ సెంచరీతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు. సన్ రైజర్స్ జట్టుకు బౌలింగే బలం అయినప్పటికీ.. బ్యాటింగ్ లైనప్ లోనూ గట్టి స్ట్రోక్ ప్లేయర్లు ఉన్నారు. కాని, వారి పూర్తి సామర్థ్యం మేరకు ఆడడం లేదు. కాని, ముంబైతో మ్యాచ్ మరోలా ఉండబోతోంది అంటోంది హైదరాబాద్ మేనేజ్‌మెంట్. కాకపోతే, ఫీలింగ్, డెత్ ఓవర్లలో బౌలింగ్‌ను మరింత స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మాత్రం గుర్తించింది. దానిపై ఇప్పటికే కసరత్తు కూడా చేస్తోందీ హైదరాబాద్.

మంగళవారం నాటి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న హైదరాబాద్ మేనేజ్‌మెంట్.. అవసరమైతే ఒకరిద్దరు ప్లేయర్లను పక్కన పెట్టేయాలనుకుంటోంది. ముఖ్యంగా మయాంక్ అగర్వాల్. మయాంక్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడే. కాకపోతే, ఈ స్టార్ ఓపెనర్ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. ఇదే జట్టును కలవరపెడుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మయాంక్ కనీసం 30 పరుగులు కూడా చేయలేదు. దీంతో ముంబైతో జరిగే మ్యాచ్ లో వేటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆక్షన్‌లో రూ.8.25 కోట్ల భారీ ధరకు మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసింది టీమ్‌మేనేజ్‌మెంట్. అయినా సరే… మరో విజయం కోసం ఫామ్‌లో లేని ఆటగాళ్లను పక్కకు పెట్టాలని చూస్తోంది. ఒకవేళ మయాంక్ అగర్వాల్ ను పక్కన పెడితే అభిషేక్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. అబ్దుల్ సమద్ తుది జట్టులోకి వస్తాడు.


బౌలింగ్‌లో కూడా పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. పరిస్థితులకు తగ్గట్లు వాషింగ్టన్ సుందర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా వాడుకోనున్నారు. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ తమ మార్క్ చూపించుకోడానికి మరిన్ని ఛాన్సులు ఇవ్వనుంది టీమ్. 

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×