E-Paper
Advertisement

MS Dhoni : ధోని కారులో సిగరెట్… సాక్షి స్మోక్ చేస్తుందా!

MS Dhoni : ధోని కారులో సిగరెట్… సాక్షి స్మోక్ చేస్తుందా!
Advertisement

MS Dhoni :  టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. టీమిండియాలో కీల‌క పాత్ర పోషించి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోనీ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం ముసురుకుంది. మైదానంలో అత్యంత ప్ర‌శాంతంగా ఉంటూ మిస్ట‌ర్ కూల్ అని పేరు తెచ్చుకున్న ధోనీ చుట్టూ ఇప్పుడూ కొత్త వివాదం ముసురుకుంది. మైదానంలో అత్యంత ప్ర‌శాంతంగా ఉంటూ మిస్ట‌ర్ కూల్ అని పేరు తెచ్చుకున్న ధోనీ కారులో సిగ‌రేట్ ఫ్యాకెట్ క‌నిపించ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. సెల‌బ్రీటీల వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై నిరంత‌రం నిఘా ఉంచే కెమెరాల కంటికి ఈ దృశ్యం చిక్క‌డంతో నెటిజ‌న్ల మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : INDW Vs SLW : నేడు భార‌త్-శ్రీలంక మ‌ధ్య ఐదో టీ20.. చివ‌రి మ్యాచ్ లో గెలిచేది ఎవ‌రో..?

ధోనీ భార్య సాక్షి స్మోక్ చేస్తుందా..?

Advertisement

ఇటీవ‌లే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. అయితే ధోనీ భార్య సాక్షి స్మోక్ చేస్తుందా..? అనే కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఆ సమయంలో ధోనీ కారును ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఒక కెమెరామెన్ కారు లోపలి భాగాన్ని జూమ్ చేయగా.. అక్కడ సీట్ల మధ్యలో ఒక సిగరెట్ ప్యాకెట్ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. ధోనీ ముందు సీట్లో కూర్చోగా, వెనుక సీట్లో సాక్షి, మరొక వ్యక్తి ఉన్నారు. ఆ ప్యాకెట్ సరిగ్గా వెనుక సీటు వైపు ఉండటంతో, అది ధోనీదా లేక కారులో ఉన్న ఇతరులదా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ధోనీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి ఏమి కాదు. గ‌తంలో కూడా ప‌లు సంద‌ర్భాల్లో ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఒక పార్టీలో ధోనీ హుక్కా తాగుతున్న వీడియో బయటకు వచ్చి అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఒక అథ్లెట్ అయి ఉండి, లక్షలాది మంది యువతకు రోల్ మోడల్‌గా ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం ఏంటని కొందరు విమర్శించగా.. అది ఆయన వ్యక్తిగత ఇష్టమని మరికొందరు సపోర్ట్ చేశారు.

అప్ప‌ట్లో ప‌ఠాన్ చేసిన‌ కామెంట్స్ వైర‌ల్

ఇప్పుడు తాజా వీడియోతో పాత వివాదాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. మరోవైపు టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. “నేను ఎవరికీ హుక్కా సెట్ చేసి ఇచ్చేవాడిని కాదు, నా ఫోకస్ అంతా గ్రౌండ్ మీదనే ఉండేది” అని ఇర్ఫాన్ గతంలో అన్నారు. ఈ మాటలు ధోనీని ఉద్దేశించే అన్నారని నెటిజన్లు ప్రచారం చేయడంతో, ఇర్ఫాన్ క్లారిటీ ఇస్తూ.. తన పాత వీడియోను తప్పుగా వాడుతున్నారని మండిపడ్డారు. ధోనీ వంటి సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న వస్తువులు కనిపించినా అవి పెద్ద వార్తగా మారుతుంటాయి. ఈ సిగరెట్ ప్యాకెట్ విషయంపై ధోనీ వైపు నుండి ఎలాంటి వివరణ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ధోనీ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది.  ముఖ్యంగా ధోనీ గురించి మొత్తానికి ఏదో ఒక వార్త‌ వైర‌ల్ కావ‌డం విశేషం.

Advertisement

Also Read : PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

 

?igsh=bmFnanNpdjdwemdl

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×