E-Paper
Advertisement

Naa Anveshana: నోటి ధూల.. దెబ్బకు 10లక్షలకు పైగా అన్ ఫాలో!

Naa Anveshana: నోటి ధూల.. దెబ్బకు 10లక్షలకు పైగా అన్ ఫాలో!
Advertisement

Naa Anveshana:ప్రముఖ యూట్యూబ్ నా అన్వేషణ అన్వేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా దేశ విదేశాలు చుట్టేస్తూ అక్కడి విషయాలను ప్రజలకు తెలియజేస్తూ భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లోనే కాదు అటు ఇంస్టాగ్రామ్ లో కూడా భారీ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈయన.. తాజాగా హిందూ దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇప్పుడు హిందూ సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫాలోవర్స్ కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ షాక్ ఇచ్చారు. ఒక్క రోజులోనే మిలియన్ కొద్దీ ఫాలోవర్స్ అన్ ఫాలో కొట్టి నా అన్వేషణ అన్వేష్ కి భారీ షాక్ ఇచ్చారు.

అన్వేష్ కి భారీ షాక్ ఇచ్చిన నెటిజన్స్..

పూర్తి వివరాల్లోకి వెళితే.. నిధి అగర్వాల్ ఘటన తర్వాత నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసాయి. సెలబ్రిటీలు ఈయనపై విరుచుకుపడుతుంటే చాలామంది నెటిజన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈయనకు మద్దతు పలుకుతున్నారు. అయితే ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. విచక్షణారహితంగా అన్వేష్ మాట్లాడుతూ చేసిన వీడియోలతో అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అన్ ఫాలో కూడా చేస్తున్నారు. అలా నిన్న ఒక్కరోజే ఏకంగా 10 లక్షల మంది ఫాలోవర్స్ తగ్గిపోయారు.

అరెస్టు చేయాలంటూ డిమాండ్…

Advertisement

ఇకపోతే శివాజీని , గరికపాటిని అనరాని మాటలు అంటూ అటు హిందూ దేవుళ్లను కూడా అవమానించాడు అన్వేష్. ముఖ్యంగా సీతాదేవి, ద్రౌపది వంటి వారి గురించి చేసిన వ్యాఖ్యలతోనే నెటిజన్ లకు పూర్తిస్థాయిలో ఆగ్రహం వచ్చింది. దీంతో నేటిజన్స్ మాత్రమే కాదు విశ్వహిందూ పరిషత్ సంస్థ కూడా అన్వేష్ వీడియోలపై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. విదేశాలలో ఉన్న అతడిని వెంటనే పట్టుకొని అరెస్టు చేసి జైల్లో పెడితే గానీ ఇకపై ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడరు అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అసలు వివాదం ఏమిటంటే?

అసలు వివాదం ఏమిటి అంటే.. శివాజీ ఆడవారి డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై అన్వేష్ స్పందించడమే కాకుండా అసభ్యపదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఆ తర్వాత ఈ వివాదంలోకి గరికపాటి నరసింహారావును కూడా లాగాడు. ఆయనను కూడా బూతులతో దూషించాడు. అంతేకాదు హిందూ దేవతలను తీసుకొచ్చి సీతమ్మ, ద్రౌపదీలను బలత్కారం చేసిన కీచకుడు, సైంధవుడు మరణించలేదా? అని మాట్లాడాడు. గుడుల ముందు అర్ధనగ్న శిల్పాలు ఉంటాయి. వాటిని తొలగించమని చెప్పండి అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఇలా నోటి దూలతో చాలా మాటలు నోరు జారాడు. రామాయణం, మహాభారతం గురించి మాట్లాడంతోనే హిందూ సంఘాలు మండిపడ్డాయి. కేసులు కూడా పెట్టాయి. అంతేకాదు ఇతడి పద్ధతి నచ్చకే ఇప్పుడు ఫాలోవర్స్ అన్ ఫాలో చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక అందరికీ సారీ చెప్పినా ఈయనకు మాత్రం తిప్పలు తప్పేలా లేవని తెలుస్తోంది.

Advertisement

ALSO READ:Rashmika -Vijay Deverakonda: రష్మిక – విజయ్ పెళ్లి డేట్ ఫిక్స్.. ఈసారైనా నిజం చేస్తారా?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×