E-Paper
Advertisement

SRH-Kavya Maran: కావ్యకు బెదింపులు.. SRH మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగినా చెప్పులతో దాడి చేస్తాం, అల్ల‌ర్లు సృష్టిస్తాం !

SRH-Kavya Maran: కావ్యకు బెదింపులు.. SRH మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగినా చెప్పులతో దాడి చేస్తాం, అల్ల‌ర్లు సృష్టిస్తాం !
Advertisement

SRH-Kavya Maran:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad ) ఓనర్ కావ్య పాప ( Kavya Maran) విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League Auction) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కావ్య పాప కొనుగోలు చేసి, వివాదంలో చిక్కుకున్నారు. దీంతో కావ్య పాప పై దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు జనాలు. ఈ వేలం జరిగినప్పటి నుంచి కావ్య పాపపై ఏదో ఒక పోస్ట్ పెట్టి దారుణంగా ఆడుకుంటున్నారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో దీని ప్రభావం మరింత పెరిగింది. తాజాగా కావ్య పాపకు బెదిరింపులు కూడా వస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎక్కడ జరిగినా, చెప్పులు, బూట్లతో దాడులు చేస్తామని కొంతమంది హెచ్చరిస్తున్నారు. కావ్య పాపకు సోషల్ మీడియా అకౌంట్ కు ట్యాగ్ చేసి మరి ఈ బెదిరింపులకు దిగుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి.

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

SRH మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగినా చెప్పులతో దాడి చేస్తాం, అల్ల‌ర్లు సృష్టిస్తాం !

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన నేపథ్యంలో కావ్య పాపను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు జనాలు. కావ్య పాప దేశద్రోహి అంటూ మండిపడుతున్నారు. వెంటనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు వ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సరికొత్తగా కావ్య పాపకు బెదిరింపులు కూడా చేస్తున్నారు కొంతమంది క్రికెట్ అభిమానులు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏ నగరంలో ఏ స్టేడియంలో అయినా మ్యాచ్ ఆడితే అక్కడ చెప్పులతో దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. అల్లర్లు సృష్టిస్తామని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ జట్టుకు అడుగడుగునా చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ఏ ఒక్క మ్యాచ్ ను కూడా తమ రాష్ట్రాలలో ఆడకుండా ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రులను డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రులు పర్మిషన్లు ఇచ్చినప్పటికీ స్టేడియంలో మాత్రం అల్లర్లు సృష్టించి, చెప్పులతో దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులు ఇస్తున్న ఈ వార్నింగ్ పోస్టులు వైరల్ గా మారాయి. అయితే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసిన విషయంలో కావ్య పాప ఎలాంటి తప్పిదం చేయలేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి కూడా క్లీన్ చీట్ వచ్చింది. విదేశీ టోర్నమెంటులో పాకిస్తాన్ ప్లేయర్లు ఉంటే ఎలాంటి తప్పిదం లేదన్నట్లుగా ఇటీవల బీసీసీఐ స్పందించింది.

Advertisement

Also Read: Tanveer Ahmed: PSL జోక‌ర్ లీగ్ అయిపోయింది..ఐపీఎల్ కోసం డ్రామాలు ఆడే దుర్మార్గుల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేయాల్సిందే

 

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×