E-Paper
Advertisement

Abhishek Sharma: అభిషేక్ శర్మ మూడుసార్లు డ‌కౌట్..పాకిస్తాన్ వాళ్ల ముందు ప‌రువు తీసిన‌ ఐస్‌లాండ్

Abhishek Sharma: అభిషేక్ శర్మ మూడుసార్లు డ‌కౌట్..పాకిస్తాన్ వాళ్ల ముందు ప‌రువు తీసిన‌ ఐస్‌లాండ్
Advertisement

Abhishek Sharma:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో అభిషేక్ శర్మ ( abhishek sharma) దారుణంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు అతడు మూడు మ్యాచ్ లు ఆడాడు. ఈ మూడు మ్యాచ్ లలో కూడా గుండు సున్నానే సాధించాడు అభిషేక్ శర్మ. పసికూన నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లపైన ఆడతాడు అనుకుంటే ఆ రెండు జట్లపైన కూడా డకౌట్ అయ్యాడు. ఇటు పాకిస్తాన్ పైన నాలుగు బంతులు ఆడి, మరోసారి డక్ ఔట్ అయ్యాడు. ఇలా అభిషేక్ శర్మ హ్యాట్రిక్ డకౌట్ ( abhishek sharma duck out) కావడంపై ఐస్ లాండ్‌ క్రికెట్ ( cricket iceland) దారుణంగా ట్రోలింగ్ చేసింది. తాజాగా తమ డ్రీమ్ 11 జట్టును ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు ఛాన్స్ ఇచ్చిన ఐస్ లాండ్ క్రికెట్ అభిషేక్ శ‌ర్మ లాంటి టీ20 నెంబ‌ర్ 1 ప్లేయ‌ర్ కు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో అభిషేక్ శ‌ర్మ ప‌రువును అంత‌ర్జాతీయంగా తీసేసింది ఐస్ లాండ్‌ క్రికెట్ ( cricket iceland).

Also Read: T20 World Cup Super 8: ద‌క్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌, టీమిండియా సూప‌ర్ 8 షెడ్యూల్ ఇదే..తెలుగోడికి అన్యాయం, సంజుకు బంప‌ర్ ఆఫ‌ర్ !

అభిషేక్ శర్మ మూడుసార్లు డ‌కౌట్.. ప‌రువు తీసిన‌ ఐస్‌లాండ్

Advertisement

ఐసీసీ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న ప్లేయర్లను ఒక దగ్గరకు చేర్చి తమ డ్రీమ్ 11 జట్టును ప్రకటించింది క్రికెట్ ఐస్‌లాండ్. ఇందులో దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్ ( Aiden Markram) ను కెప్టెన్ చేసింది ఐస్‌లాండ్. ఇక ఇండియాకు చెందిన ఇషాన్ కిషన్ కు ( Ishan Kishan) ఛాన్స్ ఇచ్చిన క్రికెట్ ఐస్‌లాండ్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ( Varun Chakravarthy) కూడా తీసుకుంది. కానీ టీ20 లలో నెంబర్ వన్ ఆటగాడిగా ఉన్న అభిషేక్ శర్మను మాత్రం జట్టులో తీసుకోకుండా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ ను తీసుకున్న ఐస్‌లాండ్.. అభిషేక్ శర్మ పరువు తీసింది. పాకిస్తాన్ వాడికి ఇచ్చిన గౌరవాన్ని ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మకు మాత్రం ఇవ్వలేదు. ఈ టోర్నమెంట్ లో మూడు సార్లు డకౌట్ అయ్యాడని అభిషేక్ శర్మను పక్కకు పెట్టింది క్రికెట్ ఐస్‌లాండ్ ( cricket iceland). దీంతో ఐస్‌లాండ్ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్ ఇప్పుడు వైరల్ గా మారింది.
అయితే పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ కు అవకాశం ఇచ్చి అభిషేక్ శర్మకు ఇవ్వకపోవడంపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

ఐస్‌లాండ్ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్

ఐస్‌లాండ్ ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవన్:  ఫర్హాన్, బెన్నెట్, మార్క్రామ్ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, మెండిస్, హోప్‌, హోల్డర్, కలుగమాగే, వ‌రుణ్ చక్రవర్తి, షాల్క్‌విక్, ముజారబానీ

Advertisement

 

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×