E-Paper
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

Hardik Pandya: హార్దిక్ పాండ్యా త‌ప్పిదం, సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

Hardik Pandya :  టి20 వరల్డ్ కప్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 కంటే ముందు టీమిండియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా జట్టుకు ( Team India) సంబంధించిన స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయం బారిన పడ్డాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొట్టిన ఓ బలమైన షాట్ కారణంగా, మహమ్మద్ సిరాజ్ కు గాయమైంది. హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) కొట్టిన బంతి నేరుగా వచ్చి మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj left knee injury) ఎడమ కాలికి తగిలినట్లు తెలుస్తోంది. బంతి బలంగా తగలడంతో అక్కడే కుప్పకూలాడు మహమ్మద్ సిరాజ్ ( Mohammed Siraj). విల‌విలాడిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూపర్ 8 కంటే ముందు టీమిండియా స్టార్ ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ గాయం మారిన పడడం, పెద్ద దెబ్బే అంటూ కామెంట్లు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

సూప‌ర్ 8 కంటే ముందే టీమిండియాకు షాక్‌..గ్రౌండ్ లో ప‌డిపోయిన ప్లేయ‌ర్‌

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇవాల్టి నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే టీమిండి ఆడే సూపర్ 8 మ్యాచ్ లు మాత్రం రేపటి నుంచి షురూ కానున్నాయి. సూపర్ 8లో మొత్తం మూడు మ్యాచులు ఆడనుంది టీమిండియా. మొదట దక్షిణాఫ్రికా, ఆ తర్వాత జింబాబ్వే ఇక చివరన వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది టీమిండియా. ఫిబ్రవరి 22వ తేదీ అంటే రేపు దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య సూపర్ 8 మ్యాచ్ ఉండనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

అయితే ఈ మ్యాచ్ కంటే ఒకరోజు ముందుగానే ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయం బారిన పడ్డాడు. తాజాగా మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగా మహమ్మద్ సిరాజ్ కు గాయమైంది. హార్దిక్ పాండ్యా కొట్టిన బంతి, సిరాజ్ కాలికి తగిలింది. దీంతో అక్కడే కుప్పకూలాడు మహమ్మద్ సిరాజ్. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. దీంతో మహమ్మద్ సిరాజ్ టోర్నమెంట్ మొత్తానికి దూరం అవుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

 

సౌతాఫ్రికా ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే

టీమిండియా ప్లేయింగ్ ఎలెవ‌న్‌: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి (alastair cook)

 

Related News

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

Big Stories

×