Rinku Singh’s father dies: టీం ఇండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ ( Rinku Singh ) ఇంట పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 5 గంటల సమయంలో రింకూ సింగ్ తండ్రి ( Rinku Singh’s father dies) ఖచేంద్ర సింగ్ క్యాన్సర్ తో మరణించారు. ఆస్పత్రి లో చికిత్స పొందుతూనే ఖచంద్ర సింగ్ మృతి చెందారు. దీంతో హుటా హుటిన చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ కు ( Aligarh) చేరుకున్నాడు రింకూ సింగ్. ఇక ఇవాళ సాయంత్రం రింకూ సింగ్ తండ్రి తండ్రి ఖచేంద్ర సింగ్ అంతక్రియలు కూడా జరిగాయి. అయితే తన తండ్రి మరణించిన నేపథ్యంలో రింకూ సింగ్ కుటుంబం విషాదంలో ఉండగా టీమిండియా ప్లేయర్లు ( Team India Players) చేసిన పని ఇప్పుడు వివాదంగా మారింది. రింకూ సింగ్ తండ్రి అంతక్రియలు పూర్తికాకముందే రీల్స్ చేస్తూ టీమ్ ఇండియా ప్లేయర్లు రచ్చ రచ్చ చేశారు. జింబాబ్వే పైన విజయాన్ని సాధించిన ఆనందంలో.. అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ లాంటి వాళ్లు విమానంలోనే రీల్స్ ( Reels ) చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే వీళ్ళ వీడియోలు వైరల్ కావడంతో ఇండియన్ ఫాన్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. తోటి క్రికెటర్ రింకూ ఇంట విషాదం నెలకొని 24 గంటలు గడవకముందే, రీల్స్ చేసి ఎంజాయ్ చేయడం అవసరమా ? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు మీకు సిగ్గుందా అంటూ మండిపడుతున్నారు.
Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచలనం !
టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే హుటా హుటిన టీమిండియాను వదిలేసి, చెన్నై నుంచి ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ కు వెళ్లాడు రింకూ సింగ్. ఇక శుక్రవారం సాయంత్రం అలీఘర్ లో ఖచంద్ర సింగ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా తన తండ్రి పాడే కూడా మోసాడు టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్. అయితే, ఈ సంఘటన నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాడు రింకూ సింగ్ ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతోంది. అటు రింకూ సింగ్ పెళ్లి కూడా ఆగిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు రీల్స్ చేస్తూ రచ్చ చేశారు. అర్షదీప్ సింగ్ ప్రతీ రోజు రీల్స్‌చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక రింకూ సింగ్ తండ్రి చనిపోయిన తర్వాత కూడా టీమిండియా ప్లేయర్లు రీల్స్ చేశారు. చెన్నై నుంచి కోల్ కతా బయలుదేరిన సందర్భంగా విమానంలో రీల్స్ చేశారు. ఇక ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రింకూ సింగ్ బాధలో ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ లను విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు.
#WATCH | Aligarh, UP: Cricketer Rinku Singh gives a shoulder to the mortal remains of his father, Khanchand Singh in his funeral procession.
Khanchand Singh passed away at Yatharth Hospital in Greater Noida earlier this morning after battling fourth-stage cancer. pic.twitter.com/dsHBgG6UIj
— ANI (@ANI) February 27, 2026
रिंकू सिंह के पिता का आज स्वर्गवास हो गया। पूरा देश रिंकू के साथ खड़ा है।
लेकिन यह देखकर थोड़ा दुख होता है कि जहाँ रिंकू का परिवार शोक में है, वहीं टीम के कुछ खिलाड़ी मस्ती भरे वीडियो और रील्स पोस्ट कर रहे हैं।
दोस्ती सिर्फ मैदान पर नहीं, बल्कि दुख के समय साथ खड़े रहने में भी… pic.twitter.com/a3FCrrVuCn
— Shilpi Yadav (@ShilpiYlucknow) February 27, 2026