Malaika Arora – Sangakkara: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా {Malaika Arora} గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తన హాట్ అండ్ ఫిట్నెస్ అందాల ప్రదర్శనతో తరచూ నెటిజెన్లను ఫీదా చేస్తూ ఉంటుంది మలైకా. అంతేకాకుండా తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో.. 50 ఏళ్లు పైబడినా తన అందంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
Also Read: Aniket Verma: వర్త్ వర్మా వర్తు…. 30 లక్షలకే బంగారు బాతును కొన్న కావ్య పాప
తన భర్తతో విడిపోయి, యంగ్ హీరోతో డేటింగ్ అండ్ బ్రేకప్ వంటి విషయాలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. ఈమె సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అర్బాజ్ ఖాన్ తో మలైకా విడాకులు తీసుకుంది. ఈ జంటకి అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఇక మలైకా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ 2018 లో డేటింగ్ ప్రారంభించగా.. 2019లో వీరి బంధాన్ని బహిరంగంగా అంగీకరించారు.
దీంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. వీరిద్దరి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ భామ ఓ దిగ్గజ క్రికెటర్ తో డేటింగ్ {Malaika Arora – Sangakkara} చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అతనితో కలిసి మలైకా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కి కూడా హాజరైంది.
అతడు మరెవరో కాదు.. ఒకప్పుడు తన బ్యాటింగ్ తో దిగ్గజ బౌలర్లను సైతం భయపెట్టిన శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగర్కర. ఇతడు ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇతడితోనే మలైకా రాజస్థాన్ రాయల్స్ డగౌట్ లో కూర్చుని {Malaika Arora – Sangakkara} చెన్నై – రాజస్థాన్ మ్యాచ్ చూస్తూ కెమెరాకి చిక్కింది. దీంతో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: MS Dhoni – Riyan Parag: బుడ్డోడు కాస్త.. ఐపీఎల్ హీరో అయ్యాడు… సక్సెస్ అంటే ఇదే
ఈ క్రమంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లుగా ఒక్కసారిగా ఊహాగానాలు జోరందుకున్నాయి. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర.. ప్రస్తుత ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు వరకు ఆ టీం హెడ్ కోచ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆ జట్టుకు క్రికెట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఈ 18వ సీజన్ నుండి మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ జట్టు కొత్త ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించడంతో.. సంగక్కర డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">