BigTV English

MS Dhoni – Riyan Parag: బుడ్డోడు కాస్త.. ఐపీఎల్ హీరో అయ్యాడు… సక్సెస్ అంటే ఇదే

MS Dhoni – Riyan Parag: బుడ్డోడు కాస్త.. ఐపీఎల్ హీరో అయ్యాడు… సక్సెస్ అంటే ఇదే

MS Dhoni – Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} సీజన్ 18 లో ఆదివారం రోజు గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బోణీ కొట్టింది. ఈ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో చెన్నై పై విజయం సాధించింది రాజస్థాన్. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.


 

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో నితీష్ రానా బ్యాటింగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత రెండు మ్యాచ్లలో తక్కువ స్కోరుకే పరిమితమైన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్.. ఆదివారం రోజు జరిగిన మ్యాచ్ లో 36 బంతులలోనే 81 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, ఐదు భారీ సిక్సులు బాదాడు. అతడు చేసింది 81 పరుగులు అయితే.. అందులో 70 పరుగులు కేవలం బౌండరీల ద్వారానే వచ్చాయి. ఇక సంజు శాంసన్ {20}, కెప్టెన్ రియాన్ పరాగ్ {37}, హిట్మేయర్ {19}, యశస్వి జైష్వాల్ {4}, దృవ్ జురెల్ {3} తక్కువ పరుగులకే విఫలమయ్యారు.


అనంతరం 183 పరుగుల భారీ లక్ష్య చేదనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. తొలి ఓవర్ నాలుగవ బంతికే ఓపెనర్ రచిన్ రవీంద్ర ను డకౌట్ చేశాడు జోఫ్రా అర్చర్. ఇక పవర్ ప్లేలో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. పెద్దగా పరుగులు రాబట్టలేకపోయింది చెన్నై. పవర్ ప్లే అనంతరం త్రిపాఠి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత దూబే {19}, విజయ్ శంకర్ {9} పరుగులు మాత్రమే చేశారు. అయితే ఓవైపు వికెట్లు పడుతున్న చెన్నై కెప్టెన్ గైక్వాడ్ మాత్రం జడేజాతో కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తరువాత గైక్వాడ్ పెవిలియన్ చేరిన తర్వాత.. ధోని {16}, జడేజా {32} ఉన్నప్పటికీ.. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో చెన్నై విజయం అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ గాయంతో ఇబ్బంది పడడంతో.. రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా యువ ఆటగాడు రియాన్ పరాగ్ కి అవకాశం ఇచ్చారు.

సంజూ కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తూండగా.. ఫీల్డింగ్ సమయంలో ఆర్ఆర్ ని రియాన్ పరాగ్ నడిపిస్తున్నాడు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్, కలకత్తా నైట్ రైడర్స్ పై వరుసగా రాజస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో.. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో చెన్నై పై జరిగే మ్యాచ్ ఆఖరిది. ఈ క్రమంలో ఆ మ్యాచ్ నీ గెలిపించాలని అతడు పడిన తపన అంతా ఇంతా కాదు. ఫీల్డింగ్, బ్యాటింగ్ సమయాల్లో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ విజయంలో కీలకంగా మారాడు. ఇక చివరి ఓవర్ లో బౌండరీ వద్ద ఉన్న హిట్ మేయర్ డ్రైవ్ చేసి మరి మహేంద్రసింగ్ ధోని క్యాచ్ పట్టుకున్న తర్వాత.. సీఎస్కే ఫాన్స్ ఈ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నారు.

 

ఇక రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత.. రియాన్ పరాగ్ దండం పెట్టి రిలాక్స్ అయ్యాడు. ఈ విజయంతో ఆర్ఆర్ జట్టు పాయింట్లు పట్టికలో పదవ స్థానం నుండి తొమ్మిదవ స్థానానికి వచ్చింది. అయితే కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని ప్రతినిత్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ ని పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనితో కలిసి దిగిన అతడి చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్ తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఇంకేం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×