E-Paper
Advertisement

Dale Steyn On Miller: చేసిందంతా చేసి, దొంగ ఏడుపులు ఎందుకురా..సింగిల్ తీయ‌క‌పోవ‌డంపై సీరియ‌స్‌

Dale Steyn On Miller: చేసిందంతా చేసి, దొంగ ఏడుపులు ఎందుకురా..సింగిల్ తీయ‌క‌పోవ‌డంపై సీరియ‌స్‌

Dale Steyn On Miller:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Delhi Capitals vs Gujarat Titans) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో చివరి వరకు పోరాడిన గుజరాత్ టైటాన్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. చివరలో రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన డేవిడ్ మిల్లర్ ( david miller ), నిర్లక్ష్యం వహించాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తుగా ఓడిపోయింది. ఇక ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్క పరుగుతో ఓడిపోయిన నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. అటు మిల్ల‌ర్ సింగిల్ తీయ‌క‌పోవ‌డంపై డేల్ స్టెయిన్ ( Dale Steyn) కూడా ఆగ్ర‌హించారు. చేత‌కాని ద‌ద్ద‌మ్మ అంటూ మండిప‌డ్డారు.

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

సింగిల్ తీయకపోవడంపై సీరియస్ అయిన డేల్ స్టెయిన్

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సందర్భంగా డేవిడ్ మిల్లర్ చేసిన తప్పిదం పై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. చివరలో సింగిల్ తీస్తే మ్యాచ్ డ్రా అయినా అయ్యేద‌ని పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై తాజాగా దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ కూడా స్పందించారు. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సిన క్రమంలో ఒక్క సింగిల్ తీసిన సరిపోయేదని.. కానీ డేవిడ్ మిల్లర్ అలా చేయకుండా ఢిల్లీ ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విన్నింగ్ షార్ట్ కొట్టాలన్న సెల్ఫిష్ ఆశతో ఢిల్లీ కొంప ముంచాడని మండిపడ్డారు డేల్ స్టెయిన్.

చేసిందంతా చేసి, దొంగ ఏడుపులు ఎందుకురా

చేసిందంతా చేసి ఇప్పుడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు డేల్ స్టెయిన్. ఈ ఓటమి కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ భారీ నష్టాన్ని మూఠ గట్టుకుందని సీరియస్ అయ్యారు. దీని అంతటికి కారణం డేవిడ్ మిల్లర్ చేతకాని తనమని మండిపడ్డారు. 19వ ఓవర్ 5 బంతికి డేవిడ్ మిల్ల‌ర్ సింగిల్ ( david miller single) తీసి, కుల్దీప్ యాద‌వ్ కు స్ట్రైక్ ఇస్తే మ్యాచ్ టై అయ్యేద‌ని పేర్కొన్నారు. ఇక త‌ర్వాతి బంతికి వికెట్ పోయినా, సూప‌ర్ ఓవ‌ర్ కు ఛాన్స్ ఉండేద‌న్నారు. సూప‌ర్ ఓవ‌ర‌ల్ నేప‌థ్యంలో గుజ‌రాత్ కంటే బ‌లమైన బ్యాటింగ్ ఢిల్లీకి ఉంద‌ని వివ‌రించారు. అలా చూసుకుంటే, సూప‌ర్ ఓవ‌ర్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప‌క్కాగా విక్ట‌రీ సాధించి ఉండేద‌ని స్ప‌ష్టం చేశారు డేల్ స్టెయిన్‌. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే నాలుగు వికెట్ల నష్టానికి 210 పరుగులు సాధించింది గుజరాత్ టైటాన్స్. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన ఢిల్లీ, 20 ఓవర్లలో 209 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.

Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభ‌వ్ 6 బంతుల్లో ఆరు సిక్స‌రు కొడ‌తాడు

 

?igsh=czFvZ3I5aXA0MTg2

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×