Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో మరోసారి 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ హాట్ టాపిక్ అయ్యారు. నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ సందర్భంగా అదరగొట్టాడు వైభవ్ సూర్య వంశీ ( vaibhav suryavanshi). ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ( jasprit bumrah) బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్ట గల మొనగాడు వైభవ్ సూర్య వంశీ అంటూ వ్యాఖ్యానించారు. ఫర్హాన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఇలా స్పందించారు. చరిత్రలో వైభవ్ సూర్య వంశీ కూడా నిలుస్తామని వెల్లడించారు.
Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్, పంజాబ్ మ్యాచ్ రద్దు వెనుక కుట్రలు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా బౌలింగ్ లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టేది కేవలం వైభవ్ సూర్య వంశీ అంటూ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్ వల్ల ఇది సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. పైకి బుమ్రా బౌలింగ్ లో 6 బంతులు ఆరు సిక్సులు కొడతానని చెబుతాడు కానీ.. వాడికి చేతకాదని చురకలు అంటించారు. రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ సందర్భంగా తొలి బంతికే బుమ్రా బౌలింగ్ లో వైభవ్ సూర్య వంశీ అద్భుతమైన సిక్సర్ కొట్టాడని ప్రశంసించారు. నెంబర్ వన్ బౌలర్ బుమ్రాకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా అతని బౌలింగ్ లో ఏకంగా రెండు సిక్సర్లు కొట్టడం సాధారణమైన విషయం కాదని తెలిపారు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే వైభవ్ సూర్య వంశీ ఆపడం ఎవరి తరం కాదన్నారు. తొందరగానే టీమిండియాలోకి వైభవ్ సూర్య వంశీ తీసుకురావాలని కూడా బీసీసీఐని కోరారు వీరేంద్ర సెహ్వాగ్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య బిగ్ ఫైట్ నిన్న జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 11 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో 150 పరుగులు రాజస్థాన్ రాయల్స్ చేయగా.. ముంబై ఇండియన్స్ 123 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పై 27 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ లో చుక్కలు చూపించాడు వైభవ్ సూర్య వంశీ. ఒకే ఓవర్ లో రెండు సిక్సర్లు కొట్టి, పరువు తీశాడు. ముఖ్యంగా బుమ్రా వేసిన తొలి బంతికి సిక్సర్ కొట్టి, వైభవ్ వైరల్ గా మారారు.
Also Read: Farhan – Smith: సింగిల్ తీయకుండా స్మిత్ ను అవమానించిన ఫర్హాన్..బాబర్ పగను తీర్చుకున్నాడుగా
🚨 VIRENDER SEHWAG COOKED SHAHIBZADA FARHAN 🚨
Aakash Chopra Said 🗣️, "A 15-year-old boy is hitting Jasprit Bumrah for sixes off fast ball. He smashed two sixes in the over his first time facing Bumrah."
Virender Sehwag Said 🗣️, "If this had been that Pakistani batsman, they… pic.twitter.com/0jjV08X60S
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 7, 2026