E-Paper
Advertisement

Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే

Tanveer Ahmed: వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి ఏజ్ ఒక్క‌టే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే
Advertisement

Tanveer Ahmed: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో నిన్నటి నుంచి వైభవ్ సూర్యవంశీ ( vaibhav suryavanshi) పేరు మారు మోగుతోంది. బుమ్రా బౌలింగ్ లో తొలి బంతికే సిక్సర్ కొట్టిన వైభవ్ సూర్యవంశీని మాజీ క్రికెటర్లు తెగ పొగిడేస్తున్నారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లు మాత్రం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అతని ఏజ్ తో పాటు బ్యాట్లపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వైభవ్ సూర్య వంశీ పై షోయబ్ అక్తర్, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లేటెస్ట్ గా వైభవ్ సూర్యవంశీ పై తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) కూడా బాంబు పేల్చారు. వైభవ్ 15 సంవత్సరాలు కాదని.. అతడు దాదాపు 25 సంవత్సరాలు ఉంటాడని ఆరోపణలు చేశారు. వైభవ్ వయసుతో పాటు బ్యాట్లను కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Inzamam-ul-Haq: కేకేఆర్‌, పంజాబ్ మ్యాచ్ ర‌ద్దు వెనుక కుట్ర‌లు…క్లౌడ్ బరస్ట్ క్రియేట్ చేశారంటూ

వైభ‌వ్ ప‌చ్చి మోస‌గాడు…వాడి బ్యాట్లు చెక్ చేయాల్సిందే

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో 14 బంతుల్లో 39 పరుగులు చేసి వైభవ్ సూర్య వంశీ చరిత్ర సృష్టించాడు. ముఖ్యంగా బొమ్మ వేసిన బౌలింగ్లో రెండు సిక్సర్లు కొట్టి ఇరగదీసాడు. ట్రెంట్ బోల్ట్, షార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్ లాంటివాళ్ళు అదిరిపోయే బంతులు వేసిన కూడా వైభవ్ సూర్య వంశీని ఆపలేకపోయారు. అర్ధరాత్రి ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఈ తరుణంలో వైభవ్ సూర్య వంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

అయితే వైభవ్ సూర్య వంశీ పై తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ పచ్చి మోసగాడు అంటూ ఫైర్ అయ్యారు. 15 సంవత్సరాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు 25 సంవత్సరాలకు పైగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అతడు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఇంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో కచ్చితంగా వైభవ్ సూర్య వంశీ పై ఐసీసీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైభవ్ సూర్య వంశీని ఎవరు ఆపలేరు అన్నారు.

ఇటీవల 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైభవ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ఊచ కోత కోస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇటీవల 15 సంవత్సరాలలో అడుగుపెట్టాడు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న వైభవ్ సూర్యవంశీ, పరీక్షలను కాదని క్రికెట్కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ కు గైర్హాజరు అయ్యాడు. ఇక ఇతనికి 15 సంవత్సరాలు వచ్చిన నేపథ్యంలో టీమిండియాలో ఛాన్స్ కూడా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Farhan – Smith: సింగిల్ తీయ‌కుండా స్మిత్ ను అవ‌మానించిన ఫ‌ర్హాన్..బాబ‌ర్ ప‌గ‌ను తీర్చుకున్నాడుగా

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×