Deepak Chahar Chit Celebration: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లీగ్ దశ మరో నాలుగు రోజుల్లో ఫినిష్ కానుండగా… ఆ తర్వాత ప్లే ఆఫ్స్ పోరు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మూడు జట్లు క్వాలిఫై కాగా.. నాలుగో స్థానం కోసం ఏకంగా ఐదు జట్లు గట్టిగా పోరాడుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చీటీల సెలబ్రేషన్స్ ( Chit Celebration) హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రతి ప్లేయర్ వికెట్లు లేదా అర్ధ సెంచరీ, సెంచరీ చేసిన తర్వాత చీటీలు తీసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే దీనిపై సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు సీరియస్ అయ్యారు. ఇదెక్కడి దిక్కుమాలిన సంప్రదాయం అంటూ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ బౌలర్ దీపక్ చాహర్ ( Deepak Chahar) దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఖాళీ చేతులతో సెలబ్రేషన్స్ చేస్తూ, చీటీల సాంప్రదాయానికి చెక్ పెట్టారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా బుధవారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ ( Kolkata Knight Riders vs Mumbai Indians) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ ఆటగాడు ఫిన్ అలెన్ ( Finn Allen ) వికెట్ తీశాడు దీపక్ చాహర్ ( Deepak Chahar) . అనంతరం తన జేబులో నుంచి చీటీ తీసినట్లుగా అందరిని ఫూల్స్ చేశాడు. ఆ తర్వాత ఖాళీ చేతులు చూపిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. తానేమీ చీటీలు తీసుకురాలేదని… ఆ సాంప్రదాయాన్ని ఆపేందుకు ఇలా చేశానని సిగ్నల్స్ ఇచ్చాడు దీపక్ చాహర్.
ఇక దీపక్ చాహర్ చేసిన ఈ పని హాట్ టాపిక్ అయింది. ఈ సంఘటన చూసిన ముంబై ఇండియన్స్ ప్లేయర్లు, అటు క్రికెట్ ఫ్యాన్స్ తెగ నవ్వుకున్నారు. ఇన్ని రోజులు చీటీల సెలబ్రేషన్స్ చూసాం.. ఇకపై ఎంప్టీ హాండ్స్ సెలబ్రేషన్స్ చూడాల్సి వస్తుందేమో అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని అవలీలగా కేకేఆర్ చేదిస్తోంది. ఇందులో కేకేఆర్ గెలిస్తే, ప్లే ఆఫ్స్ ఛాన్సులు మరింత పెరుగుతాయి.
Deepak Chahar brought out the imaginary chit celebration 🤣🤣🤣#KKRvsMI #DeepakChahar pic.twitter.com/oMJttDJZgd
— Faruk (@uf2151593) May 20, 2026