Dragon Luger: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబో అనగానే హోప్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.. ‘కెజిఎఫ్’తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘డ్రాగన్’ అనే సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేశాడు.ఇక తారక్ బర్త్ డే రోజు రిలీజ్ అయిన సినిమా గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది కూడా . ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో ఎన్టీఆర్ పాత్ర పేరు ‘లూగర్’ అని రివీల్ అవ్వడంతో, ఈ పేరు వెనుక ఉన్న అసలు అర్థంఏమై ఉంటుందా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.
‘లూగర్’ అనేది ఒక లెజెండరీ జర్మన్ పిస్టల్
నీల్ తన సినిమాల్లో హీరో పాత్రలను ఎంత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతారో తెలిసిందే. ‘కెజిఎఫ్’లో రాకీ భాయ్, ‘సలార్’లో దేవా పాత్రలు ఆయా సినిమాలకు ప్రాణంగా నిలిచాయి. ఇప్పుడు ‘డ్రాగన్’లో ‘లూగర్’ అనే పేరును ఎంచుకోవడం వెనుక చాలా లోతైన అర్థం ఉందన్నది ట్రేడ్ పండిట్స్ మాట. హిస్టరీని చూస్తె ‘లూగర్’ అనేది ఒక లెజెండరీ జర్మన్ పిస్టల్ (తుపాకీ) పేరని తెలుస్తుంది.మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మన్ సైన్యం దీనిని విచ్చలవిడిగా ఉపయోగించింది.కారణం టార్గెట్ ని మిస్ కాకుండా శత్రువుని చంపడంలో దిట్ట అని ఈ లూగర్ పిస్టల్ కి మారుపేరు కాబట్టి. అంటే, సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం మనిషి మాత్రమే కాదు, శత్రువులను క్షణాల్లో వేటాడే ఒక డేంజరస్ వెపన్ అని నీల్ ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడన్న మాట.
Also read :పెళ్లికి ముందు ఒకలా.. శోభనం రాత్రి మరోలా! అసలు పెళ్లికొడుకు ఏం చేశాడంటే?
1967 కాలం నేపథ్యంలో నడిచే పీరియడ్ యాక్షన్ డ్రామా
ఇక ఈ పేరు వెనుక ఉన్న ఇంటెన్సిటీని బట్టి, ఎన్టీఆర్ పాత్ర చాలా క్రూరంగా మరియు పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని అర్థమవుతోంది కూడా.ఇకఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక ‘అసాసిన్-ఇన్-చీఫ్’గా, అంటే ప్రధాన హంతకుడిగా ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’లో పనిచేస్తున్నట్లు సమాచారం. 1967 కాలం నేపథ్యంలో నడిచే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) వ్యాపారం, స్మగ్లింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సినిమా జరగబోతుందని గ్లిఇమ్ప్స్ చూస్తేనే అర్థమవుతుంది.
రక్తపాతం, మాఫియా యుద్ధాలు ఈ చిత్రానికి హైలైట్
బ్రిటిష్ వారు భారతదేశం నుండి వెళ్ళిపోయిన తర్వాత దేశంలో ఓపియం వ్యాపారం రెండు ప్రధాన సంస్థలుగా విడిపోతుంది. ఒకటి ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, మరొకటి ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’. వీటి మధ్య జరిగే రక్తపాతం, మాఫియా యుద్ధాలు ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ కానున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణీ వసంత కథానాయికగా నటిస్తుండగా, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ అనే కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటిస్తున్న సంగతి తెల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఇక ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్, ఎన్టీఆర్ విశ్వరూపం, భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయమని కాలర్ ఎగరేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.చూడాలి మరి జూన్ 11, 2027న థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనున్న డ్రాగన్ ఆ అంచనాలని అందుకుంటాడో లేదో !
Also read :రాజకీయాలా.. సినిమాలా? ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఆప్తమిత్రుడు!