Sanju VS Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే సోమవారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ (Chennai Super Kings vs Sunrisers Hyderabad) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai ) వేదికగా ఈ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్ కీపర్ సంజు శాంసన్, కాటేరమ్మ కొడుకు క్లాసెన్ మధ్య గొడవ చోటు చేసుకుంది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ( Heinrich Klaasen ).. సంజు శాంసన్ (Sanju Samson) చేతిలో స్టంప్ ఔట్ అయ్యాడు. అచ్చం ధోనీ లాగానే క్లాసెన్ ను ఔట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఓవర్ గా సంజు సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే అది నచ్చని కాటేరామ్మ కొడుకు క్లాసెన్… సంజు దగ్గరే ఆగి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకసారి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు వెళ్లగా… మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ వైపు మళ్ళింది. కానీ చివరగా మన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఏకంగా 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లాయి. ఇక అటు చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఛాన్సులు మరింత క్లిష్టంగా మారాయి. ఇక ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ మొదట బౌలింగ్ చేయగా… చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నిర్నిత 20 ఓవర్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్… 180 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది హైదరాబాద్. దీంతో ప్లే ఆఫ్స్ లోకి దూసుకెళ్లింది సన్ రైజర్స్.
ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు క్వాలిఫై అయిన నేపథ్యంలో.. నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడుతున్నాయి. అయితే చెన్నై తన తర్వాతి మ్యాచ్లో కచ్చితంగా గెలిచి.. పంజాబ్, రాజస్థాన్ గెలుపు ఓటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్స్ లోకి వెళ్తుంది. ఇటు రాజస్థాన్ రాయల్స్ తన తర్వాతే రెండు మ్యాచ్ లలో గెలిస్తే… 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. అప్పుడు పంజాబ్ అలాగే చెన్నై ఇంటి దారి పట్టాలి.
– RCB have Qualified.
– GT have Qualified.
– SRH have Qualified.3 TEAMS HAVE QUALIFIED FOR PLAYOFFS IN THIS IPL 2026 & NOW ONE SPOT LEFT…!!!!! 🏆 pic.twitter.com/V16qVyaIs7
— Tanuj (@ImTanujSingh) May 18, 2026
Heinrich Klaasen got stumped for the first time in IPL history today, and Sanju Samson is the only wicketkeeper to do it. 😭🔥 pic.twitter.com/QfWpx4j3GO
— Mahi Patel (@Mahi_Patel_07) May 18, 2026
Noor Ahmad breaks the partnership for Chennai Super Kings with a brilliant stumping by Sanju Samson 🔥
He dismisses Heinrich Klaasen for a quickfire 47 off just 26 balls 👌
SRH: 131/3 (14.3)#Cricket #CSKvSRH #IPL2026 pic.twitter.com/LMvaAfYKT4
— Sportskeeda (@Sportskeeda) May 18, 2026