IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Delhi Capitals vs Mumbai Indians) మధ్య ఎనిమిదవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఢిల్లీ పోలీస్ అధికారి చేసిన పని వివాదంగా మారింది. చీర్ లీడర్ డాన్స్ చేస్తుండగా ఆమె ప్రైవేట్ అందాలను తన కెమెరాలు క్యాప్చర్ చేస్తూ కనిపించాడు సదరు ఢిల్లీ పోలీస్. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీ పోలీసులపై ( Delhi Police ) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కామంతో ఢిల్లీ పోలీసులు రెచ్చిపోతున్నారని నెటిజెన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. చివరికి చీర్ లీడర్లను ( Cheer leaders ) కూడా వదలడం లేదంటూ మండిపడుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య శనివారం రోజున అరుణ్ జైట్లీ ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియం ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటిష్టమైన బందోబస్తును స్టేడియం దగ్గర ఏర్పాటు చేశారు. పోలీసులందరూ స్టేడియం దగ్గర బందోబస్తు చేస్తుంటే, ఇందులో ఓ ఢిల్లీ పోలీస్ మాత్రం రెచ్చిపోయి ప్రవర్తించాడు. ఢిల్లీ పోలీసుల పరువు తీశాడు. ఢిల్లీకి సంబంధించిన చీర్ లీడర్స్ డాన్స్ చేస్తుండగా, వాళ్ల ప్రైవేట్ అందాలను క్యాప్చర్ చేస్తూ కనిపించాడు ఓ పోలీసు.
ఇతను ఢిల్లీలోని ఓ ప్రముఖ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బౌండరీ వెళ్లగానే చీర్ లీడర్స్ డాన్స్ చేస్తుండగా.. సైలెంట్ గా ఓ లేడీ ప్రైవేట్ అందాలను తన కెమెరాలో బంధించాడు. అయితే ఈ తతంగం అంతా స్టేడియం కెమెరాలో రికార్డు అయింది. ఈ సంఘటన బయటికి వచ్చిన నేపథ్యంలో దారుణంగా క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. పొట్టకూటి కోసం పొట్టి బట్టల్లో జనాల ముందు డ్యాన్సులు చేస్తున్న చీర్ లీడర్స్ ను కూడా పోలీసులు వదలడం లేదని ఫైర్ అవుతున్నారు. ఢిల్లీ పోలీసులు ఇంత కామాంధులా అంటూ మండిపడుతున్నారు. ఆ పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్, 6 వికెట్ల తేడాతో విజయం సాధించి..మంబైకి షాక్ ఇచ్చింది.
cheerleaders under the tight security of delhi police 👌 pic.twitter.com/LUWYrRP5x9
— Sunil The Cricketer (@1sInto2s) April 4, 2026