E-Paper
Advertisement

Delhi Capitals-Dog: మ్యాచ్ మ‌ధ్య‌లో ఊర‌ కుక్క ఎంట్రీ…ఎత్తి అవ‌త‌ల ప‌డేసిన ఢిల్లీ ప్లేయ‌ర్ అభిషేక్

Delhi Capitals-Dog: మ్యాచ్ మ‌ధ్య‌లో ఊర‌ కుక్క ఎంట్రీ…ఎత్తి అవ‌త‌ల ప‌డేసిన ఢిల్లీ ప్లేయ‌ర్ అభిషేక్
Advertisement

Delhi Capitals-Dog: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. రేపు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) మధ్య తొలి మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. అయితే రేపటి నుంచి టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అనుకోని అతిధిలాగా ఓ ఊర కుక్క ( Dog) గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే గ్రౌండ్ లోకి వచ్చిన ఆ కుక్కను చాలా తెలివిగా ఢిల్లీ ప్లేయర్ అభిషేక్ పోరెల్ ( Abhishek Porel ) ఎత్తుకొని, బయట వదిలేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Tanveer Ahmed On PSL: ఛీ..ఛీ నిజంగా పాకిస్తాన్ బికారి దేశమే..కెప్టెన్స్‌ ప్రెస్ మీట్ ను పెళ్లి పందిరిగా మార్చారు క‌ద‌రా

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ లోకి ఊర కుక్క‌

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతో ఫుల్ బిజీగా కనిపిస్తోంది. అయితే ఈ క్రమంలో అరుణ్ జైట్లీ స్టేడియం లోకి ఒక్కసారిగా ఊర కుక్క ఎంట్రీ ఇచ్చింది. మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతున్న సమయంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే కుక్క రావడంతో క్రికెటర్లు అందరూ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఢిల్లీ ఆటగాడు అభిషేక్ పోరెల్ మాత్రం పెద్ద సాహసమే చేశాడు. ఆ కుక్కను తన భుజాలపైన ఎక్కించుకొని ఫోజులిచ్చాడు. ఆ తర్వాత కుక్కతో కాసేపు ఆడుకున్నాడు. అనంతరం గ్రౌండ్ బయట వదిలేశాడు అభిషేక్ పోరెల్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. అభిషేక్ పోరెల్ ను మెచ్చుకుంటున్నారు.

అభిషేక్ పోరెల్ ఐపీఎల్ కెరీర్

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున వికెట్ కీపర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పోరెల్, ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో 31 మ్యాచ్ లు ఆడాడు. ఈ సందర్భంగా 661 పరుగులు సాధించాడు. 65 పరుగులు అతని కెరీర్ లో హైయెస్ట్ స్కోర్. 149 స్ట్రైక్ రేటుతో ఇరగదీసే దమ్మున్న క్రికెటర్ అభిషేక్ పోరెల్. ఇక ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు మూడు అర్థ సెంచరీలు మాత్రమే సాధించాడు. ఎక్కడ కూడా పెద్దగా మెరిసిన దాఖలాలు లేవు. ఇది ఇలా ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో తన తొలి మ్యాచ్ ఏప్రిల్ ఒకటవ తేదీన లక్నోతో ఆడనుంది.

Advertisement

 

 

Also Read: IPL 2026 2nd Phase Schedule: ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..ఆ ఈవెంట్ ర‌ద్దు, ఫైన‌ల్స్ ఎప్పుడంటే

 

?igsh=MXljaTFqaDRoMGx1

 

 

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×