Tanveer Ahmed On PSL: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కొనసాగే ఈ మెగా టోర్నమెంట్ కు సంబంధించిన కెప్టెన్స్ ప్రెస్ మీట్ ( PSL Captains Pressmeet) నిన్న జరిగింది. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ( David Warner), బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ లాంటి కెప్టెన్స్ అందరూ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) స్పందించారు. ఇది ప్రెస్ మీట్ కాదని, పెళ్లి పందిరి తరహాలో ఉందని పరువు తీశారు. పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా తీసేలా మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వ్యవహరించాడని తన్వీర్ అహ్మద్ సీరియస్ అయ్యారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Also Read : Fans On Mohsin Naqvi: నఖ్వీ పెద్ద మోసగాడు..PSL టికెట్ల రిఫండ్ డబ్బులు తినేశాడంటూ పాక్ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ లాహోర్ వేదికగా హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ లాహోర్ క్వాలండర్స్ జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. రాత్రిపూట జరిగే మ్యాచ్ ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది. ఇక రోజుకు రెండు మ్యాచ్ లు జరిగినప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు ఒక మ్యాచ్ నిర్వహిస్తారు. సాయంత్రం ఏడున్నరకు మరొక మ్యాచ్ ఉంటుంది. అయితే ఇవాళ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న కెప్టెన్ల ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా 8 జట్ల కెప్టెన్స్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ నిర్వహణపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ కెప్టెన్ ప్రెస్ మీట్ కాదని, పెళ్లి పందిరి వేసినట్లుగా ఈ ఈవెంట్ ఉందని పరువు తీశారు తన్వీర్ అహ్మద్. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయిందని మండిపడ్డారు. దీంతో అందరూ పాకిస్తాన్ బికారి దేశం అని ట్రోలింగ్ చేస్తున్నారని చురకలు అంటించారు. కెప్టెన్స్ ప్రెస్ మీట్ అంటే, ఉన్నతమైన కార్యక్రమమని.. దానిని చాలా చీప్ గా నిర్వహించిన మొహ్సిన్ నఖ్వీపై మండిపడ్డారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన కెప్టెన్స్ ప్రెస్ మీట్ ను చూసి ప్రపంచమంతా నవ్వుతోందని.. ఇదంతా మొహ్సిన్ నఖ్వీ వైఫల్యమైన అని మండిపడ్డారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ, మొహ్సిన్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు తన్వీర్ అహ్మద్.
🚨 TANVEER AHMED ANGRY ON PSL AND MOHSIN NAQVI 🚨
"Yesterday the world saw how poor we are. PSL organised a captain meet-up and the stage like a 'Shaadi' stage with no proper arrangements. The world was laughing at us, and we deserve it.* 😂pic.twitter.com/PPzHiyuzTQ
— Cricket Central (@CricketCentrl) March 26, 2026