E-Paper
Advertisement

WPL : అష్లీ గార్డ్ నర్ ఆల్ రౌండర్ షో.. ఢిల్లీపై గుజరాత్ విజయం..

WPL : అష్లీ గార్డ్ నర్ ఆల్ రౌండర్ షో.. ఢిల్లీపై గుజరాత్ విజయం..
Advertisement

WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జట్టు ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. గత రెండు మ్యాచ్ ల్లోనూ ఓడిన ఆ జట్టు బలమైన ఢిల్లీ క్యాపిటల్స్ పై 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. లారా వాల్ వార్ట్ (45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 57 ), అష్లీ గార్డ్ నర్ (33 బంతుల్లో 9 ఫోర్లతో 51 నాటౌట్ ) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. హర్లీన్ డియోల్ (31) కూడా రాణించింది. దీంతో బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై గుజరాత్ పోరాడే స్కోర్ సాధించింది. ఢిల్లీ జట్టులో జెస్ జనెసన్ 2 వికెట్లు తీయగా.. కాప్, అరుంధతీరెడ్డి తలో వికెట్ తీశారు.

148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు విజయం కోసం చివరి వరకు పోరాడింది. షఫాలీ వర్మ (8), జెమీమా రోడ్రిగ్స్ (1) మెగ్ లానింగ్ (18), కాప్సీ (22) తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ ఒక దశలో 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాప్ (36) కాసేపు ఒంటరి పోరాటం చేసినా రనౌట్ గా వెనుదిరగడంతో ఢిల్లీ విజయానికి దారులు మూసుకుపోయాయి. అప్పటికే 97 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.

Advertisement

తెలుగమ్మాయి అరుంధతీరెడ్డి (17 బంతుల్లో 4 ఫోర్లతో 25 రన్స్ ) అద్భుత పోరాటం చేసి ఢిల్లీలో మళ్లీ గెలుపు ఆశలు రేకెత్తించింది. అయితే అరుంధతీరెడ్డి, పూనమ్ యాదవ్ 1 పరుగు తేడాతో అవుట్ కావడంతో ఢిల్లీ 18.4 ఓవర్లలోనే 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ , తనూజ కన్వర్, అష్లీ గార్డ్ నర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్నేహ రాణా, హర్లీన్ డియోల్ తలో వికెట్ తీశారు. హాఫ్ సెంచరీతో అజేయంగా నిలవడంతోపాటు 2 వికెట్లు తీసిన అష్లీ గార్డ్ నర్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మహిళల ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టు ఆడిన 5 మ్యాచ్ ల్లోనూ గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 6 మ్యాచ్ ల్లో 4 విజయాలు , 2 పరాజయాలతో రెండో స్థానంలో ఉంది. యూపీ వారియర్స్ 5 మ్యాచ్ ల్లో రెండు విజయాలు, 3 ఓటములతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ 6 మ్యాచ్ ల్లో 2 విజయాలు, 4 పరాజయాలతో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 పరాజయాలు , 1 విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది.

Advertisement

Paper cups:-పేపర్ కప్స్‌పై కొత్త ప్రయోగం.. స్టార్టప్ ఐడియాతో..

RRR : హైదరాబాద్ కు చేరుకున్న RRR టీమ్.. ఎయిర్ పోర్ట్ లో ఫ్యాన్స్ సందడి..

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×