BigTV English
Advertisement

Char Dham Yatra:చార్ థామ్ యాత్రకి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు…

Char Dham Yatra:చార్ థామ్ యాత్రకి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు…

Char Dham Yatra:ఏప్రిల్ లో చార్ ధామ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఏప్రిల్ 22న తెరుచుకుంటాయి. శీతాకాలం కావడం, మంచుకురుస్తుండటంతో ఆరు నెలల పాటు కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. కేధార్ నాథ్ గుడి ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 27న తెరుచుకుంటాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో చార్ ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా కూడా ఈ యాత్ర కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు. యాత్ర అని టైప్ చేసి 91 8394833833 నెంబర్ కు వాట్సాప్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.


యాత్రికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలుకాగా.. 2.50 లక్షల మందికి పైగా భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. కేదార్ నాథ్ దర్శించుకునేందుకు 1.39 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 1.14 లక్షల మంది భక్తులు బద్రీనాథ్ సందర్శనకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకి వచ్చే భక్తుల భారీ సంఖ్యలో ఉండబోతోంది. రికార్డు సంఖ్యలో భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది .

కేదారనాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25 ఉదయం 6.20 గంటలకు తెరుస్తారు. అలాగే బద్రీనాధ్ ఆలయాన్ని ఏప్రిల్ 27వ తేదీన తెరవనున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవల భూమి కుంగిపోయిన జోషిమఠ్ ప్రభావం చార్ థామ్ యాత్రపై ఉండదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ అన్నారు. యాత్రికులకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత యాత్ర జరగడంతో కింద ఏడాది రికార్డు స్థాయిలో 47 లక్షల మందికి పైగా బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను దర్శించుకున్నారు.


తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికుల కోసం ఉత్తరాఖండ్ పోలీసులు ఇప్పుడు తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారు. నార్త్ సైడ్ నుంచి వచ్చే భక్తులతో మాట్లాడేందుకు ఎలాంటి భాష సమస్య లేదు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచే వారికి హిందీ రాకపోవడంతో వారితో కమ్యూనికేట్ చేయడానికి పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి పోలీసులు తెలుగు నేర్చుకుంటున్నారు. అలాగే తమిళం కూడా నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Lavish Flowers : సంపంగి పూలతో పూజ ఫలితాలివి

Ghost Fish : రెయిన్‌బో కలర్స్‌ను ప్రతిబింబిస్తున్న చేప చర్మం..

Related News

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Karthika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే.. ఏడాదంతా దీపారాధన చేసిన ఫలితం

Golden Temple Telangana: హైదరాబాద్‌‌‌కు సమీపంలో బంగారు శివలింగం.. ఈ ఆలయం గురించి మీకు తెలుసా?

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !

Karthika Pornami 2025: కార్తీక పౌర్ణమి.. విశిష్టత ఏంటి ?

Big Stories

×