Harbhajan Singh on Greg Chappell: టీమిండియా ఒకప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ పై హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాడు పెద్ద రాక్షసుడు అని… కోచ్ గా ఉన్నప్పుడు టీమిండియాలో ప్లేయర్ల మధ్య గొడవలు కావాలనే పెట్టించాడని ఆరోపణలు చేశారు. ఇలా ప్లేయర్ల మధ్య గొడవలు పెట్టించి టీమిండియాను సర్వ నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించగల శక్తిగా టీమిండియా అప్పట్లో మారిందన్నారు. ఈ విషయం గ్రహించి భారత జట్టును నాశనం చేశాడని ఫైర్ అయ్యారు. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన గ్రెగ్ చాపెల్, సొంత దేశం కోసం మాత్రమే పనిచేశాడని ఆరోపించారు. ఆస్ట్రేలియాను దెబ్బ కొట్ట గల శక్తి ఉన్న టీమిండియాను వెన్నుపోటు పొడిచాడని ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీని విలన్ చేసే ప్రయత్నం కూడా చేశాడని మండిపడ్డారు. దీంతో గ్రెగ్ చాపెల్ పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
గ్రెగ్ చాపెల్ వ్యవహారంపై షాకింగ్ నిజాలను హర్భజన్ సింగ్ పంచుకున్నారు. సౌరవ్ గంగూలీని కెప్టెన్ స్థాయికి తీసుకువచ్చింది అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ అని… కానీ ఏమైందో తెలియదు… ఇద్దరు మధ్య గ్యాప్ పెరిగిందని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో టీమిండియా పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. ఆ సమయంలో అత్యంత దారుణమైన పరిస్థితిని టీమిండియా ప్లేయర్లు ఎదుర్కున్నారని వివరించారు. విభజించు పాలించు అన్నట్టుగా గ్రెగ్ చాపెల్ వ్యవహారం తయారైందని మండిపడ్డారు. టీమిండియా క్రికెటర్లలో సీనియర్లను డివైడ్ చేసి.. అందరి మధ్య గొడవలు సృష్టించాడని మండిపడ్డారు. ప్లేయర్ల మధ్య గొడవలు పెట్టి రాజకీయాలకు తెరలేపాడని ఆగ్రహించారు.
ఆస్ట్రేలియాలో ఓడించగల శక్తిగా టీమిండియా తయారైన నేపథ్యంలో… ఇండియాను కావాలనే గ్రెగ్ చాపెల్ నాశనం చేశాడని ఫైర్ అయ్యారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి సీనియర్ క్రికెటర్ల మధ్య గొడవలు పెట్టాడని.. దీనికి నేనే సాక్ష్యం అన్నారు. అలాగే దాదా కెప్టెన్ గా పనికిరాడు అని బిసిసిఐకి మెయిల్ పెట్టిన దుర్మార్గుడు కూడా గ్రెగ్ చాపెల్ అన్నారు. ఇది ఇలా ఉండగా గ్రెగ్ చాపల్ వివాదం నేపథ్యంలో టీమిండియా అస్తవ్యస్తమై 2007 వన్డే వరల్డ్ కప్ సమయంలో గ్రూప్ స్టేజ్ నుంచే ఎలిమినేట్ అయింది. బంగ్లాదేశ్ తో పాటు శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోవడంతో గ్రెగ్ చాపల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని వచ్చాక టీమిండియా బలమైన జట్టుగా మారిపోయింది.