Vaibhav Sooryavanshi Father Warns Gambhir: టీమిండియా వర్సెస్ విండీస్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఇవ్వడం లేదంటూ వస్తున్న వార్తలపై అతని తండ్రి సంజీవ్ మండిపడ్డారు. ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు అంటూ వార్నింగ్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. నా కొడుకుకు అవకాశం ఇవ్వకపోతే మట్టి కొట్టుకుపోతారంటూ బాంబ్ పేల్చారని తెలుస్తోంది. ఐపీఎల్ లో ఇరగదీసిన తన కొడుకు వైభవ్ కు అవకాశం ఇవ్వకుండా పెద్దగా పరుగులు చేయలేని, స్థిరత్వం లేని వాళ్లకు ఎలా అవకాశాలు ఇస్తావంటూ మండిపడ్డారు. విండీస్ తో జరుగనున్న నాలుగో టీ20లో మావోడికి ఛాన్స్ ఇస్తేనే సరే, లేకపోతే గంభీర్ అంతు చూస్తానని కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో గంభీర్ పై వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
వైభవ్ సూర్యవంశీ తక్కువ వయస్సులోనే టీమిండియాలోకి వచ్చాడని.. అలాంటోడిని ఆడించాల్సిందేనని తండ్రి సంజీవ్ సూర్యవంశీ కోరారు. అందరి అంచనాలకు అందకుండా టీమిండియాలోకి వైభవ్ వచ్చాడని.. కొందరు తన కొడుకుపై కుళ్లు కుంటున్నట్టు ఫైర్ అయ్యారు. అందుకే వాటర్ బాయ్ గానే తన కొడుకుకు ట్రీట్ చేస్తున్నట్టు మండిపడ్డారు. అతన్ని టీమిండియాకు దూరంగా ఉంచి, మానసికంగా దెబ్బ కొట్టేందుకు కుట్రలు చేస్తున్నట్టు కూడా ఆరోపణలు చేశారు. దీనికి గంభీర్ కూడా కారణం అవుతున్నాడని ఆగ్రహించారు. ఇకనైనా తన కొడుకు వైభవ్ పై కుట్రలు ఆపాలని కోరారు. హైదరాబాద్ గడ్డపై తన కొడుకు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లోనే సెంచరీ చేశాడని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో నాలుగో టీ20 ఆడించాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే అందరి అంతు చూస్తానని హెచ్చరించారు. దీంతో సంజీవ్ సూర్యవంశీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వైభవ్ ను ఆడించడంపై అభిషేక్ నాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరీస్ గెలిచాక వైభవ్ సూర్యవంశీని ఆడించండని కోరారు. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మంచి టాలెండ్ ఉన్నవాడని తెలిపారు. నిలబడి సిక్సులు కొట్టే ఆటగాడని ప్రశంసించారు. ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ హెడెన్ లాగా వైభవ్ ఆడుతున్నాడని వెల్లడించారు. అలాంటోడిని బాగా వాడుకోవాలని కోరారు. సంజు శాంసన్ ను పక్కనబెట్టి, వైభవ్ సూర్యవంశీకి చివరి మ్యాచ్ లో అవకాశం ఇస్తే బెటర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అలా కుదరకపోతే, సంజు శాంసన్ ను ఫస్ట్ డౌన్ లో దించాలని కోరారు. అప్పుడు వైభవ్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా దిగుతారన్నారు.