Sara Tendulkar Birthday Celebration With Shubman Gill: సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్… మరోసారి వార్తల్లో నిలిచారు. టీమిండియా వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్ తో కలిసి ఆమె తన 29వ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నట్టు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా అర్జున్ సతీమణి సానియా చందోక్ ముందే సారా, గిల్ ఇద్దరూ రొమాన్స్ చేసినట్టు కూడా పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. ఈ సందర్భంగా సారాకు గిల్ హగ్ ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం మ్యాచ్ లు లేకపోవడంతో తన ప్రియురాలు సారాతో గిల్ చిల్ అయినట్టు పేర్కొంటున్నారు.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా 29వ పుట్టిన రోజు తాజాగా చేసుకున్నారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు చేసుకున్న సారా… ఆ తర్వాత ముంబైలోని ప్రముఖ హోటల్ లో తన స్నేహితులకు పార్టీ ఇచ్చారు.. ఈ వేడుకకు అర్జున్ టెండూల్కర్ సతీమణి సానియా చందోక్ కూడా హాజరయ్యారు. అయితే ఈ పుట్టిన రోజు పార్టీకి టీమిండియా వన్డే కెప్టెన్ గిల్ వచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. గిల్ ముఖం క్లియర్ గా కనిపించలేదు కానీ… సారాను హగ్ చేసుకున్న ఓ వ్యక్తి ఫోటో వెనుక నుంచి కనిపించింది.
బ్లాక్ షర్ట్ వేసుకున్న సదరు వ్యక్తి సారాను ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి గిల్లేనని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఇది చూసినా క్రికెట్ అభిమానులు అతడు గిల్ అని కొందరు అంటుంటే… మరికొంతమంది అర్జున్ టెండూల్కర్ అని కామెంట్ చేస్తున్నారు. గిల్, సారా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని… కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. సానియా ముందే సారా టెండుల్కర్ ఇలా దిగజారి ప్రవర్తించబోదని కౌంటర్ ఇస్తున్నారు. సచిన్ కుటుంబ పరువు తీయాలనే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆగ్రహిస్తున్నారు.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా అలాగే కెప్టెన్ గిల్ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నట్టు నిత్యం పోస్టులు వలవుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే చాలా సార్లు హోటల్ లో ఇద్దరు కనిపించినట్టు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ…ఎక్కడా వీళ్లు స్పందించలేదు.