E-Paper
Advertisement

Hardik-Murali kartik: హార్దిక్ పాండ్యాకు ఒళ్లంతా బ‌లుపే…మురళి కార్తీక్‌ తో గొడ‌వ‌, వార్నింగ్ ఇస్తూ మ‌రీ

Hardik-Murali kartik: హార్దిక్ పాండ్యాకు ఒళ్లంతా బ‌లుపే…మురళి కార్తీక్‌ తో గొడ‌వ‌, వార్నింగ్ ఇస్తూ మ‌రీ
Advertisement

Hardik-Murali kartik: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య శుక్రవారం రోజున రాయ్‌పూర్ వేదికగా రెండవ టి20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో 7 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. న్యూజిలాండ్ విధించిన 209 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అద్భుతంగా రానించి చేదించగలిగింది. ఈ విజయంతో 2-0 తేడాతో సిరీస్ లో ముందుకు దూసుకు వెళ్ళింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ( Hardik Pandya), మాజీ క్రికెటర్ మురళి కార్తీక్‌ (Murali kartik) మధ్య గొడవ చోటు చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఏమైందో తెలియదు కానీ ఈ ఇద్దరి మధ్య ఒకసారిగా చిన్నపాటి గొడవ జరిగింది.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

హార్దిక్ పాండ్యా, మురళి కార్తీక్‌ మధ్య గొడవ

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ 2t20) మధ్య రాయ్ పూర్ వేదికగా రెండవ టి20 మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభాని కంటే ముందు టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తూ కష్టపడ్డారు. ఇందులో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో కామెంటేట‌ర్‌ గా మెరిసారు టీమిండియా మాజీ క్రికెటర్ మురళి కార్తీక్‌. అయితే ప్రాక్టీస్ చేసేందుకు గ్రౌండ్ లోకి వస్తున్న హార్దిక్ పాండ్యాను మురళి కార్తీకే ముందుగా పలకరించాడు. ఏమైందో తెలియదు గానీ వెంటనే రియాక్ట్ అయిన హార్దిక్ పాండ్యా, మురళి కార్తీక్‌ తో గొడవ పెట్టుకున్నాడు. వేలు చూపిస్తూ మరి బెదిరించాడు. దానికి షాక్ అయిన మురళి కార్తీక్‌, హార్దిక్ పాండ్యాను కూల్ చేసే ప్రయత్నం చేశాడు. అయినా కూడా హార్దిక్ పాండ్యా మాత్రం తగ్గలేదు.

గట్టిగా అరిచేసాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. కాసేపు అలాగే గొడవ జరిగి ఉంటే ఇద్దరు కొట్టుకునేవారు. ఈ సంఘటన ఎప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఇద్దరి మధ్య ఏమైంది ? అలా ఒక్కసారిగా అరుచుకున్నారు ఏంటి ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోని చూసిన మరి కొంత మంది క్రికెట్ అభిమానులు, డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. హార్దిక్ పాండ్యా మొదటి భార్య గురించి మురళి కార్తీక్‌ అడిగినట్లు ఉన్నాడని.. అందుకే ఒక్కసారిగా హార్దిక్ పాండ్యా రెచ్చిపోయి ప్రవర్తించాడని అంటున్నారు. లేదా ప్రస్తుత ప్రియురాలు మహికా శర్మ గురించి అడిగాడు కావచ్చు ? అందుకే హార్థిక్ పాండ్యా రెచ్చిపోయి ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఇక మ్యాచ్ ప్రారంభమైన తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసే సమయంలో కూడా కోపానికి వచ్చాడు. న్యూజిలాండ్ బ్యాట‌ర్ ను బండ బూతులు తిడుతూ కనిపించాడు.

Advertisement

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా Hardik Pandya angry at Murali Kartik

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×