E-Paper
Advertisement

Jugnuma The Fable OTT : చెట్లు కాలిపోయే రహస్య సంఘటనల చుట్టూ తిరిగే కథ… క్షణక్షణం ఉత్కంఠభరితం

Jugnuma The Fable OTT : చెట్లు కాలిపోయే రహస్య సంఘటనల చుట్టూ తిరిగే కథ…  క్షణక్షణం ఉత్కంఠభరితం
Advertisement

Jugnuma The Fable OTT : మనోజ్ బాజ్‌పేయి ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్. Jugnuma: The Fable సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మనోజ్ బాజ్‌పేయి మళ్లీ మాస్టర్‌పీస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. థియేటర్లలో రిలీజ్ అయి కొంచెం అండర్‌రేటెడ్ అయినా, క్రిటిక్స్ నుంచి రేవ్ రివ్యూస్ వచ్చిన మూవీ ఇది. ఇప్పుడు 4 నెలల తర్వాత స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. మరి ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? దీని కథ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

మనోజ్ బాజ్‌పేయితో పాటు దీపక్ డోబ్రియాల్, ప్రియాంక బోస్, తిలోత్తమ శోమ్ కీలక పాత్రలు పోషించిన ‘Jugnuma: The Fable’ రామ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చింది. థియేటర్లలో 2025 సెప్టెంబర్ 12న రిలీజ్ అయి, 2026 జనవరి 22 నుంచి Amazon Prime Videoలో హిందీ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. థియేటర్లలో పెద్దగా నోటీస్ చేయకపోయినా, 74వ అంతర్జాతీయ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రీమియర్ అయి మంచి ప్రశంసలు అందుకుంది. మ్యాజికల్, ఎమోషనల్ డ్రామా మిక్స్‌తో సూపర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 38వ లీడ్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

1989వ సంవత్సరంలో హిమాలయ పర్వతాల పైన ఉన్న ఒక విశాలమైన పండ్ల తోట నేపథ్యంలో ఈ కథ మొదలవుతుంది. దేవ్‌ (మనోజ్ బాజ్‌పేయి) తన భార్య నందిని, పిల్లలతో కలిసి అక్కడ ఒక పురాతన బంగ్లాలో నివసిస్తుంటాడు. దేవ్‌కు తానే సొంతంగా తయారు చేసుకున్న చెక్క రెక్కలతో పర్వతాల పైనుండి ఎగరడం అంటే చాలా ఇష్టం. దానిని అతను ఒక ధ్యానంలా భావిస్తాడు. అందంగా, ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితంలోకి అనుకోకుండా కొన్ని వింత సంఘటనలు జరుగుతాయి. వాళ్ళ తోటలోని యాపిల్ చెట్లు కాలిపోవడం మొదలవుతాయి. ఈ మంటలు ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారో ఎవరికీ అర్థం కాదు.
ఈ మంటల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టే క్రమంలో దేవ్‌ తన మేనేజర్ మోహన్‌తో కలిసి దర్యాప్తు ప్రారంభిస్తాడు. మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అడవిలో కొత్త చోట్ల మంటలు పుడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో స్థానిక గ్రామస్థులు, సంచార జాతులపై అనుమానాలు మొదలై, వారి మధ్య విభేదాలు పెరుగుతాయి.చివరకు ఈ సంఘటనలకు కారణం ఎవరు ? దేవ్‌ వాళ్ళను కనిపెట్టాడా ? అనేదే మిగతా కథ.

Read Also : పట్టుకొచ్చిన కొద్దీ పారిపోయే కూతురు… అండర్ వరల్డ్ ట్విస్ట్ తో సాగే సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×