E-Paper
Advertisement

చ‌క్రం తిప్పిన రోహిత్.. పాండ్యా, సూర్య‌కు ఔట్…ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా తెలుగోడు ?

చ‌క్రం తిప్పిన రోహిత్.. పాండ్యా, సూర్య‌కు ఔట్…ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా తెలుగోడు ?
Advertisement

RCB VS MI:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు కెప్టెన్ ను నియామకం చేసేందుకు అంబానీ ఫ్యామిలీ డిసైడ్ అయినట్లు కథనాలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను తొలగించి, కొత్త కెప్టెన్ తో జట్టును ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) స్థానంలో సూర్య కుమార్ యాద‌వ్ కు ఛాన్స్ వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ… తిలక్ వర్మ కు (Tilak Varma) లేదా రోహిత్ శర్మ ( Rohit Sharma) ఇద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలని ఈ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు క‌థ‌నాలు వైర‌ల్ అవుతున్నాయి.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

పాండ్యా, సూర్య‌కు ఔట్…ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా తెలుగోడు ?

Advertisement

ముంబై ఇండియన్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మే 10వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాయిపూర్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఫిట్ గా ఉన్న హార్దిక్ పాండ్యా కు అవకాశం ఇవ్వలేదట ముంబై యాజమాన్యం. ఇందులో భాగంగానే అతన్ని రాయిపూర్ కు పంపించలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అవుతాడు అనుకున్నప్పటికీ… అతని ఫ్యామిలీ ఇష్యూస్ తెరపైకి వచ్చాయి. కుటుంబ సమస్యల నేపథ్యంలో బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ కూడా దూరం కాబోతున్నాడట.

అంటే ఇద్దరు తోపు ప్లేయర్లు సైడ్ అయ్యారన్నమాట. దీంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తారు అనుకుంటే.. ముంబై యాజమాన్యం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మాను ఇంపాక్ట్ ప్లేయర్ గానే కొనసాగిస్తూ… తిలక్ వర్మ కు కెప్టెన్సీ చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఈ మేరకు రోహిత్ శర్మకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తిలక్ వర్మకు సూచనలు ఇస్తూ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించాలని రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారట అంబానీ. ఇంపాక్ట్ ప్లేయర్ అయినప్పటికీ ఫుల్ పవర్స్ రోహిత్ శర్మకు ఇవ్వబోతున్నారట. ముంబై ఇండియన్స్ జట్టులో తిలక్ వర్మ చాలా రోజులుగా కొనసాగుతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్ గా చేసిన అనుభవం కూడా అతనికి ఉంది. చాలా సార్లు ముంబై ఇండియన్స్ ను విజయ తీరాలకు చేర్చాడు తిలక్. మొన్నటికి మొన్న సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. జట్టుకు కష్టం వచ్చిందంటే ముందుగా తిలక్ వర్మ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అలా తిలక్ వర్మ తయారయ్యాడు. అందుకే తిలక్ వర్మకు అవకాశం ఇచ్చేందుకు ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Advertisement

 

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×