E-Paper
Advertisement

గడ్డి యంత్రంలో చిక్కుకుని కూలీ మృతి..!

గడ్డి యంత్రంలో చిక్కుకుని కూలీ మృతి..!
Advertisement

Worker Accident: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రచ్చ సంపత్ రెడ్డి (51) గడ్డి కట్టలు కట్టే రోలర్ యంత్రం వద్ద కూలి పనికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ ఉపాధి కోసం పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు ఆయన యంత్రంలో చిక్కుకుపోయారు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి యంత్రాన్ని ఆపి బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందినట్లు తెలిసింది.

Also Read: పోలీస్ స్టేషన్ లో ‘ఏందయ్య సామీ’.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ప్రమాదానికి గల కారణాలు..

Advertisement

ఒక్కసారిగా జరిగిన ఈ విషాదంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. సంపత్ రెడ్డి మృతి కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది. మృతునికి భార్యతో పాటు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కదిలించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు. అనుకోని ప్రమాదంలో కుటుంబ పోషకుడిని కోల్పోయిన ఈ కుటుంబం పరిస్థితి చూసి గ్రామస్తులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

Also read: తెలంగాణ మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇక పండగే..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×