E-Paper
Advertisement

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లైందా..? ఆమె భ‌ర్త ఇత‌నేనా..సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్

Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ పెళ్లైందా..? ఆమె భ‌ర్త ఇత‌నేనా..సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్
Advertisement

Harmanpreet Kaur: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించింది. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ మరియు కెప్టెన్ గా ప్రతిభ కనబరిచి ప్రపంచ అత్యుత్తమ మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలవడమే కాదు.. ప్రపంచ కప్ ను సాధించిన కెప్టెన్ గా చరిత్రలో నిలిచిపోయింది.

Also Read: Smriti Mandhana wedding: స్మృతి మందాన వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి ఎప్పుడంటే?

Advertisement

డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించిన మన అమ్మాయిలు.. తొలి వరల్డ్ కప్ టైటిల్ ని సాధించారు. ముఖ్యంగా మహిళల ప్రపంచకప్ 2025 ట్రోఫీని దక్కించుకొని సూపర్ స్టార్ గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. తద్వారా కోట్లాదిమంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది.

హర్మన్ ప్రీత్ కౌర్ జీవిత ప్రయాణం:

1989 మార్చ్ 8న పంజాబ్ లోని యోగ పట్టణంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించింది హర్మన్ ప్రీత్. ఈమె తండ్రి హర్మిందర్ సింగ్ బుల్లర్. ఇతడు మొదట బాస్కెట్ బాల్, ఆ తరువాత వాలీబాల్, అనంతరం న్యాయస్థానంలో క్లర్క్ గా పనిచేశాడు. హర్మన్ ప్రీత్ తల్లి సత్విందర్ కౌర్. ఈమె గృహిణి. హర్మన్ ప్రీత్ తండ్రి.. ఆమె క్రీడా ప్రస్తానానికి ప్రధాన ప్రేరణగా నిలిచారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూతురిని జియాన్ జ్యోతి స్కూల్ అకాడమీలో శిక్షణకు పంపుతూ.. లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేశాడు. కోచ్ కమల్దీప్ సింగ్ సోది వద్ద ఆమె కఠిన శిక్షణ తీసుకుంది. పంజాబ్ కి చెందిన హర్మన్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది. 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన మొదలు.. క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతి ఫార్మాట్ లోను ఈమెది ప్రత్యేకమైన ముద్ర.

Also Read: SRH Kavya Maran: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన SRH ఓనర్ కావ్య పాప?

హర్మన్ ప్రీత్ కౌర్ పెళ్లయిందా..?

Advertisement

తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఆమె ఓ వ్యక్తి పక్కన నిలబడి ఉంది. అయితే అతడే ఆమె భర్త అంటూ కొందరు సోషల్ మీడియాలో ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్ కౌర్ కి నిజంగానే పెళ్ళి జరిగిందా..? అంటూ ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు క్రీడాభిమానులు. మరికొందరు వరుడు ఎవరు మేడమ్..? అంటూ ప్రశ్నించారు. నిజానికి హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇంకా వివాహం కాలేదు. ఈమె వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ప్రస్తుతం మహిళా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు, బ్యాటింగ్, ఫీల్డింగ్ పై ఆమె తన పూర్తి దృష్టి సారించింది. అందువల్ల వైరల్ గా మారిన ఈ ఫోటో ద్వారా హర్మన్ ప్రీత్ కి వివాహం జరిగిందన్నది పూర్తిగా ఆవాస్తవం.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×