E-Paper
Advertisement

Smriti Mandhana wedding: స్మృతి మందాన వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి ఎప్పుడంటే?

Smriti Mandhana wedding: స్మృతి మందాన వెడ్డింగ్ కార్డు వైరల్.. పెళ్లి ఎప్పుడంటే?
Advertisement

Smriti Mandhana wedding: భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందానా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్ ని వివాహం చేసుకోబోతోంది. నవంబర్ 20వ తేదీన స్మృతి మందాన వివాహం జరగబోతోంది. అయితే ఆమెకు కాబోయే వరుడు ఎవరో తెలుసా.. నటుడు, గాయకుడు, దర్శకుడు, సంగీతకారుడు పలాష్ ముచ్చల్. 2019లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. స్మృతి మందాన సొంత ప్రాంతం సాంగ్లీలో వివాహం చేసుకోబోతోంది.

Also Read: SRH Kavya Maran: ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన SRH ఓనర్ కావ్య పాప?

Advertisement

మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతం స్మృతి మందాన సొంత ఊరు. అందుకే వీరి వివాహ వేడుకలను ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకకి ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనే విధంగా ఈ వివాహ వేడుక జరగనుంది.

వెడ్డింగ్ కార్డు వైరల్:

పలాష్ – స్మృతి మందాన పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ శుభలేఖ ఎంపిక విషయంలో ఇప్పటికే ఎంతోమంది విభిన్న కోణాలలో ఆలోచించి ముద్రించినా.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు శుభలేఖలు అనగానే పెళ్లి తేదీ, వరుడు, వధువు కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. కానీ కొందరు రొటీన్ కి భిన్నంగా ఆలోచించి పెళ్లి పత్రికల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే స్మృతి మందాన పెళ్లికి సంబంధించిన శుభలేఖ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక స్మృతి అభిమానులు వీరి పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పలాష్ ముచ్చల్ ఎవరో తెలుసా..?

Advertisement

1995 మే 22న పలాష్ ముచ్చల్ ఓ మార్వాడి కుటుంబంలో జన్మించాడు. ఇతడు ప్రముఖ గాయకురాలు పాలక్ ముచ్చల్ సోదరుడు. ఈయన కూడా ఓ ప్రొఫెషనల్ గాయకుడు. తన సోదరి లాగే ఆయన కూడా అనేక పాటలను స్వరపరిచాడు, పాడాడు. ఇక పలాష్ సినిమాలలో నటన, దర్శకత్వంలో కూడా రాణించాడు. రాజ్ పాల్ యాదవ్ – రుబీనా దిలైక్ నటించిన “అర్ద్” చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విమర్శకుల పరిశంసలను అందుకుంది.

Also Read: SHAMI-BCCI: షమీవి అన్ని దొంగ నాటకాలే.. మాతో గేమ్స్ ఆడుతున్నాడు.. బీసీసీఐ సీరియస్

బాలీవుడ్ లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు పలాష్. 18 ఏళ్ల వయసులోనే పలాష్ తన మొదటి పాటను కంపోజ్ చేశాడు. ఇక క్రికెట్ లో తన కవర్ డ్రైవ్ లు, మెరుపు బ్యాటింగ్ తో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మందాన.. ఇకపై సంగీత ప్రపంచంతో బంధుత్వం కలుపుకోబోతోంది. పలాష్ ప్రస్తుతం రాజు బజేవాలా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×