E-Paper
Advertisement

Head Vs Kohli: ఒకే జ‌ట్టులో ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ..మ‌ళ్లీ చిచ్చు పెట్టిన పాకిస్తాన్‌

Head Vs Kohli: ఒకే జ‌ట్టులో ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ..మ‌ళ్లీ చిచ్చు పెట్టిన పాకిస్తాన్‌
Advertisement

Head Vs Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ మధ్య గొడవ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad) మధ్య మే 22వ తేదీన మ్యాచ్ జరుగుతున్న క్రమంలో ఇద్దరు స్టార్ల మధ్య గొడవ చోటుచేసుకుంది. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత ట్రావిస్ హెడ్ ( Travis Head) షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తే… విరాట్ కోహ్లీ ( Virat Kohli) నిరాకరించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీని దోషిగా చూపించి దారుణంగా కామెంట్లు పెడుతున్నారు మాజీ క్రికెటర్లు. అయితే ఈ గాయాన్ని మళ్లీ రేపింది పాకిస్తాన్.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

ఒకే జ‌ట్టులో ట్రావిస్ హెడ్, కోహ్లీ

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) నేపథ్యంలో ఇప్పటినుంచే అన్ని జట్లు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్టార్ ఆటగాడు మిస్బా ఉల్ హక్ ( Misbah-ul-Haq)… తన డ్రీమ్ వ‌న్డే వరల్డ్ కప్ 2027 జట్టును ప్రకటించాడు. ఇందులో మొన్న గొడవ పడిన ట్రావిస్ హెడ్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు ఉన్నారు. ఓపెనర్ గా హెడ్ ను సెలెక్ట్ చేసిన మిస్బా ఉల్ హక్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. ఈ జట్టుకు కెప్టెన్ ఎవరనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించాడు. హెడ్, కుషాల్ మెండిస్ ఇద్దరు ఓపెనర్లుగా ఉంటారని వివరించాడు.

పుండుమీద కారం చల్లిన పాకిస్తాన్‌

ఆ తర్వాత బాబర్ ఆజం, విరాట్ కోహ్లీ, హ్యారీ బ్రూక్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్, అబ్రార్ అహ్మద్, మిచెల్ శాంట్నర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు మిస్బా ఉల్ హక్. అయితే మొన్న గొడవ పడిన విరాట్ కోహ్లీ అలాగే హెడ్ ను ఒకే జట్టులో ఉంచడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ అభిమానులు దీనిపై పెదవి విరుస్తూ.. మిస్బా పైన సీరియ‌స్ అవుతున్నారు. మీ పాకిస్తాన్ కుక్కలు ( Pakistan Dogs) అనుకున్నంత మాత్రాన… హెడ్ ఉండే జట్టులో మా విరాట్ కోహ్లీ ఉండబోడని కామెంట్లు చేస్తున్నారు. అలాంటి జట్టును అసలు కోహ్లీ పట్టించుకోడని కౌంటర్లు పేల్చుతున్నారు. క్రికెట్ ఆడటం చేతకాని వెధవలందరూ… పాకిస్తాన్ లోనే ఉన్నారని మండిపడుతున్నారు. అందరూ కలిసి విరాట్ కోహ్లీ పై కుట్రలు చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు అభిమానులు.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×