SRH VS RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా ఇవాళ రసవత్తర ఫైట్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో ప్రారంభ మ్యాచ్ లో తరబడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium, Hyderabad) వేదికగా సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇలాంటి క్రమంలో ఇప్పటికే స్టేడియానికి క్రికెట్ అభిమానులు చేరుకుంటున్నారు. ఎలాగైనా ఇందులో గెలవాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. ఇప్పటికే చెన్నైని చిత్తు చేసిన హైదరాబాద్… బెంగళూరు పైన అధికారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరికాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ బెంగుళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో… సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వార్ కొనసాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేస్తామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు పోస్ట్ లు పెడుతుంటే.. వాళ్లకు SRH ఫ్యాన్స్ అదే స్థాయిలో కౌంటర్లు పేల్చుతున్నారు. ఇవాళ బెంగళూరు పైన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 కు పైగా కచ్చితంగా కొడతామని హైదరాబాద్ ఫ్యాన్స్ పోస్టులు వైరల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 300 పరుగులు హైదరాబాద్ చేస్తుందని ఓ లేడీ అభిమాని పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.
ఈ సందర్భంగా కాటేరమ్మ కొడుకు హేన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) 46 బంతుల్లో 120 పరుగులు చేశాడని… అభిషేక్ శర్మ (Abhishek Sharma) 52 బంతుల్లో 130 పరుగులు చేసినట్లు పోస్ట్ క్రియేట్ చేసి రచ్చ చేసింది. దీంతో ఇది నిజంగానే జరిగిందని కొంత మంది షాక్ అవుతున్నారు. ఈ పోస్టును అందరికి షేర్ చేస్తున్నారు. ఈ పోస్టు ఫేక్ కావచ్చు.. కానీ నిజంగా చేసి చూపిస్తామని మరికొంతమంది అభిమానులు ఈ సందర్భంగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, మ్యాచ్ అయ్యాక ఎవరు గెలుస్తారో చూసుకుందామని బెంగుళూరు అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు అభిమానుల మధ్య వార్ మాత్రమే కనిపిస్తోంది.
ఇది ఇలా ఉండగా ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ అలాగే బెంగుళూరు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. అయితే బెంగళూరు పైన భారీ స్కోర్ తేడాతో హైదరాబాద్ గెలిస్తే… రెండో స్థానానికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. దానివల్ల క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే ఛాన్సులు హైదరాబాద్ దక్కించుకుంటుంది. క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడే టీం.. ఓడిపోయినా, ఎలిమినేషన్ లో ఒక ఛాన్స్ ఉంటుంది. అందుకే రెండో స్థానానికి వెళ్లేందుకు హైదరాబాద్ కష్టపడాల్సిన అవసరం ఉంది.
https://www.facebook.com/photo/?fbid=3430860097066302&set=a.103647796454232