E-Paper
Advertisement

PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు
Advertisement

PAK VS AUS:  పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతుంద నేపథ్యంలోనే అదే సమయంలో పాకిస్తాన్ లో వన్డే సిరీస్ షురూ అవుతుంది. ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియాతో ఆడే మూడు వన్డేల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తమ జట్టును కూడా ప్రకటించింది. షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) సారథ్యంలోని 16 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టును ప్రకటించింది. అయితే ఇందులో ఆల్ రౌండర్ షాబాద్ ఖాన్ (Shadab Khan) కూడా ఉన్నాడు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026, అంతకు ముందు సిరీస్ లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచాడు షాబాద్ ఖాన్. ఇలాంటి క్రమంలో అతని సెలెక్షన్ పై పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు మాజీ ఆటగాళ్లు సీరియస్ అవుతున్నారు.

Also Read: Ramiz Raza : ఆస్ట్రేలియా కంటే భ‌యంక‌రంగా బంగ్లాదేశ్ మారింది…నిద్ర‌లోనూ పాకిస్తాన్ ప్లేయ‌ర్లు వ‌ణికిపోతున్నారు

షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీపై తిరుగుబాటు చేసిన పాక్ ప్లేయ‌ర్‌

Advertisement

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (Pakistan vs Australia) మధ్య జరిగే 3 వన్డేల సిరీస్ నేపథ్యంలో షాబాద్ ఖాన్ సెలక్షన్ పైన క్రికెటర్ ఖుష్దిల్ షా ( Khushdil Shah) సీరియస్ అయ్యారు. షాబాద్ ఖాన్ పెద్ద జోకర్ అని.. వాడికి ఆడడం చేతకాదని మండిపడ్డారు. అలాంటి జోకర్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సెలెక్ట్ చేయడంపై సీరియస్ అయ్యారు. అన్ని ఫార్మట్స్‌ లో తాను అద్భుతంగా రాణిస్తున్నానని.. అయినప్పటికీ మొహ్సిన్ న‌ఖ్వీ… తనను పట్టించుకోలేదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. షాబాద్ ఖాన్ ఏదో ఆశ చూపడం లేదా బెదిరింపుల‌కు దిగ‌డం వల్ల.. మొహ్సిన్ న‌ఖ్వీ అమ్ముడుపోయాడని ఆరోపణలు చేశారు ఖుష్దిల్ షా. ఈ మేర‌కు ఖుష్దిల్ షా సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. వాస్తవంగా జట్టు సెలక్షన్ తర్వాత మాజీ క్రికెట్లు ఇలా రియాక్ట్ అవుతారు. కానీ పాకిస్తాన్ లో మాత్రం చాలా డిఫరెంట్. ఒక ప్లేయర్ ను సెలెక్ట్ చేశారని మండిపోయి… మరో ప్లేయర్ సోషల్ మీడియా వేదికగానే ప్రశ్నించాడు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్ ఇప్పటికే ఖరారు అయింది. పాకిస్తాన్లో జరగనున్న ఈ టోర్నమెంట్ మే 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వండేలు జరుగుతాయి. ఈ సిరీస్ నేపథ్యంలో షాహీన్ అఫ్రిది కెప్టెన్ గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్ గా సల్మాన్ అలీ అఘా ఉంటాడు. రిజ్వాన్ పై వేటు వేశారు.

Advertisement

Also Read: BAN VS PAK: పాకిస్తాన్ ఘోర ఓట‌మి..టెస్టు సిరీస్‌ వైట్ వాష్ చేసిన బంగ్లాదేశ్‌, WTCలో మ‌రింత దిగిజారిన టీమిండియా

 

 

 

Related News

ట్రావిస్ హెడ్ లాంటి వెధవలకు అలా జ‌ర‌గాల్సిందే..కోహ్లీకి హర్భజన్ సింగ్ స‌పోర్ట్

పాకిస్తానోడికి హ‌గ్గులు…ట్రావిస్ హెడ్ కు పంగ‌నామాలా ? కోహ్లీపై SRH ఫ్యాన్స్ ముప్పేట‌దాడి

Michael Vaughan: ధోని, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి బుద్ది తెచ్చుకో…హెడ్ కు కోహ్లీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే !

Mohammad Amir: రూ.100 కోట్లు ఇచ్చి, కాళ్లు మొక్కినా ఐపీఎల్ ఆడ‌ను..ఇండియా అంట‌నే నాకు అస‌హ్యం

SRH దెబ్బ‌కొట్టేందుకు జితేష్ శ‌ర్మ ఫేక్ ఇంజురీ డ్రామాలు..రిష‌బ్ పంత్ ను కాపీ కొట్టి మ‌రీ

Kavya Maran-Krunal: కృనాల్ బౌన్స‌ర్ల‌పై కావ్య పాప అస‌హ‌నం..వాడిది ది త్రో బౌలింగ్ అంటూ!

కోహ్లీకి ఇంత‌ బ‌లుపెందుకు? ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌కుండా అవ‌మానం, RCB ఫ్యాన్స్ తిరుగుబాటు

Vaibhav Suryavanshi: టీమిండియా కెప్టెన్ అవుతా, పాకిస్తాన్ పై 6 బంతుల్లో 6 సిక్స‌ర్లు కొడ‌తా

Big Stories

Advertisement
×