Hardik vs Kuldeep: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) టీమిండియాలో గొడవలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొలంబో వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పై ( Suryakumar Yadav) కుల్దీప్ యాదవ్ ( kuldeep yadav ) గరం గరంగా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వచ్చాయి. ఇవి చూసిన నెటిజెన్స్.. రక రకాలుగా స్పందిస్తున్నారు. టీమిండియాలో గొడవలు మొదలయ్యాయని.. టోర్నమెంట్ కీలక దశలోకి వచ్చినప్పుడు ఇలా జరగడం దారుణం అంటూ రియాక్ట్ అవుతున్నారు. దీనిపై వెంటనే బీసీసీఐ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్కర్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా కొలంబో వేదికగా నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఫినిష్ అయ్యే క్రమంలో కుల్దీప్ యాదవ్ ఓ క్యాచ్ మిస్ చేశాడు. అది కూడా హార్దిక్ పాండ్యా ( hardik pandya) బౌలింగ్ లో కావడం గమనార్హం. అప్పటికే ఇషాన్ కిషన్ ఓ క్యాచ్ మిస్ చేయగా.. అనంతరం కుల్దీప్ యాదవ్ కూడా అదే తప్పిదం చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా బండ బూతులు తిట్టాడు. సాధారణంగా కుల్దీప్ యాదవ్ బాగా చేసే ఫీల్డర్ కాదు. అయినప్పటికీ క్యాచ్ పట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఆ సమయంలో హార్ధిక్ పాండ్యా తిట్టడంతో కుల్దీప్ యాదవ్ కూడా కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత టీమిండియా ప్లేయర్లు షేక్ హాండ్స్ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తే.. అతని వీపులో గట్టిగా కొట్టి కుల్దీప్ యాదవ్ సీరియస్ గా కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో టీమిండియాలో గొడవలు మొదలయ్యాయని జోరుగా ప్రచారం అందుకుంది.
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటనపై కుల్దీప్ యాదవ్ అలాగే సూర్య కుమార్ యాదవ్ రీల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. గ్రౌండ్ లో జరిగిన సంఘటనను మరోసారి రిపీట్ చేశారు. ఇద్దరు కోపంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న రీల్ సోషల్ మీడియాలో పెట్టారు. తమ మధ్య ఇలాంటి గొడవ లేదని.. ఆ సమయంలో కాస్త కోపానికి వచ్చినట్లు కుల్దీప్ యాదవ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ కూల్ అవుతున్నారు.
Also Read: IND VS PAK: శివరాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓటమి, సూపర్ 8లోకి టీమిండియా