E-Paper
Advertisement

BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?
Advertisement

BAN PAK – T20 World Cup: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( PCB ) ఐసీసీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మనసు మార్చి, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి వైదొలిగేలా కుట్ర‌లు ప‌న్నిన‌ పాకిస్తాన్ కు ( Pakistan) షాకిచ్చేందుకు అదిరిపోయే స్కెచ్ వేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్. ఒకవేళ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( 2026 T20 World Cup ) నుంచి పాకిస్తాన్ తప్పుకుంటే, బంగ్లాదేశ్ కు ( Bangladesh ) అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాకిస్తాన్ గ్రూప్ A లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే, ఆస్థానంలోకి బంగ్లాదేశ్ కు అవకాశం ఇవ్వనుందట ఐసీసీ. అంతేకాదు బంగ్లాదేశ్ డిమాండ్ చేసినట్లు శ్రీలంక వేదికగా మ్యాచ్ లు నిర్వహించేందుకు ఐసీసీ ఆలోచన చేస్తోందట. అంటే పాకిస్తాన్ శ్రీలంకలో ఆడాల్సిన మ్యాచ్ లన్ని కూడా బంగ్లాదేశ్ ఆడనుంది అన్నమాట.

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడేందుకు 15 మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ జట్టును ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టును ప్రకటించినప్పటికీ కూడా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ఆడే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. నిన్న పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో మొహ్సీన్ న‌ఖ్వీ సమావేశం కూడా అయ్యారు. ఈ సమావేశం అయిన తర్వాత ఆసక్తికర పోస్టు కూడా పెట్టారు మొహ్సీన్ న‌ఖ్వీ. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఆడే విషయంపై ప్రధాని షరీఫ్ తో చర్చించినట్లు వెల్లడించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు.

శుక్రవారం లేదా వచ్చే సోమవారం రోజున టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడే విషయంపై స్పష్టత ఇస్తామని మొహ్సీన్ న‌ఖ్వీ ట్వీట్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఐసీసీ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. సమయానికి పాకిస్తాన్ తప్పుకుంటే, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు అవకాశం ఇచ్చేందుకు ఐసీసీ ప్రణాళికలు చేస్తోందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం గ్రూప్-ఏలో ఉంది. అయితే పాకిస్తాన్ తప్పుకుంటే, ఆ స్థానంలో బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇవ్వనున్నారట. అంటే బంగ్లాదేశ్ డిమాండ్ చేసినట్లుగానే శ్రీలంక వేదికగా మ్యాచ్ లు జరుగుతాయి. పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు అన్నీ బంగ్లాదేశ్ ఆడనుంది అన్నమాట. అదే జరిగితే టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరి 15వ తేదీన మ్యాచ్ ఉంటుంది. ఈ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. అటు ఈ డీల్ కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఒప్పుకున్నట్లు టాక్ న‌డుస్తోంది.

Advertisement

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

 

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×