T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదు. రేపటి నుంచే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఫైనలైంది. ప్రతిరోజు మూడు మ్యాచ్ ల చొప్పున టోర్నమెంట్ ఫినిష్ చేయబోతున్నారు. టీమిండియా తన తొలి మ్యాచ్ రేపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో ఆడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ( t20 world cup 2026 Schedule) రేపటి నుంచి మార్చి 8వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఈ టోర్నమెంట్లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. ఒక్కో గ్రూపులో ఐదు జట్ల చొప్పున మొత్తం నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపు A లో ఇండియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూనిటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్లు ఉన్నాయి. ఈ మేరకు ఇండియా వర్సెస్ USA జట్ల మధ్య తొలి మ్యాచ్ రేపు జరుగుతుంది. రేపు టోర్నమెంట్ ప్రారంభం కాగానే పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా ఉదయం 11 గంటలకు మ్యాచ్ ఉంటుంది.
ఆ తర్వాత వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం మూడు గంటలకు మరో మ్యాచ్ నిర్వహిస్తారు. ఇక సాయంత్రం ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా చివరి మ్యాచ్ ఉంటుంది. ఇలా ప్రతిరోజు మూడు మ్యాచ్ లు నిర్వహిస్తారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20 world cup 2026 live streaming ) జియో హాట్ స్టార్ లో రానుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ వేదికగా కూడా ఈ మ్యాచ్ లు తిలకించవచ్చు. శ్రీలంక అలాగే ఇండియాలోనే మ్యాచ్ లు జరుగుతున్నాయి కాబట్టి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారమే అన్ని ఉంటాయి. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) ప్రారంభానికి కంటే ముందే ఆసీస్ కు షాక్ తగిలింది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ ఈ టోర్నమెంట్ క దూరంగా కాగా తాజాగా జోష్ హేజిల్ వుడ్ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇండియాతో జరిగే మ్యాచ్ బహిష్కరించింది పాకిస్థాన్. బంగ్లాదేశ్ పట్ల అన్యాయంగా ఇండియా అలాగే ఐసీసీ వ్యవహరించినందుకుగాను బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఫిబ్రవరి 15వ తేదీన జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు కాబోతుంది.
Here's the 𝗙𝗨𝗟𝗟 𝗥𝗘𝗩𝗜𝗦𝗘𝗗 𝗦𝗖𝗛𝗘𝗗𝗨𝗟𝗘 of the #T20WorldCup2026 🏆🤩🏏
[Thread 🧵] pic.twitter.com/YydAVZJ4Fk
— CricketGully (@thecricketgully) January 24, 2026
🚨 SURYAKUMAR YADAV NOT HOLDING BACK 🚨
Suryakumar Yadav cooked Pakistan as Surya took the selfie with T20 World Cup Captains, but removed Salman Ali Agha before taking the selfie 😆 pic.twitter.com/wPrxRMmQdl
— Richard Kettleborough (@RichKettle07) February 5, 2026