Trolls On Jemimah Rodrigues: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) నేపథ్యంలో గురువారం ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women, Final,) మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన బెంగుళూరు మహిళల జట్టు ఆరు వికెట్లతో విజయం సాధించింది. దీంతో రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది స్మృతి మందాన ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు. అయితే ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్. క్రిస్టియన్ అయిన జెమిమా రోడ్రిగ్స్ కు ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ఫైనల్స్ లో ఓడిపోయిందని దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఆమెకు కాకుండా మరో వ్యక్తికి కెప్టెన్సీ ఇస్తే ఖచ్చితంగా ఢిల్లీ గెలిచేదని పోస్టులు పెడుతున్నారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా మరోసారి జెమిమా రోడ్రిగ్స్ మతం గురించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. క్రిస్టియన్ అయిన జెమిమా రోడ్రిగ్స్ కు ఢిల్లీ కెప్టెన్సీ ఇవ్వడం వల్ల, ఫైనల్స్ లో ఓడిపోయిందని ఫైర్ అవుతున్నారు. ఆ మతస్తులకు అసలు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని ఢిల్లీ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. మరో వ్యక్తికి కెప్టెన్సీ ఇస్తే బాగుండేదని సూచనలు చేస్తున్నారు. ఢిల్లీ ఓటమికి ఆ మతం ( Jesus) ఒక్కటే కారణమని హిందువులు ఫైర్ అవుతున్నారు. కాగా మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సందర్భంగా ఓ మ్యాచ్ గెలిచిన తర్వాత అంతా జీసస్ మాయా అంటూ జమీమా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి జెమిమా రోడ్రిగ్స్ ను సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు జనాలు. ఇక ఇప్పుడు అదే జెమిమా రోడ్రిగ్స్ (Trolls On Jemimah Rodrigues) శాపం ఢిల్లీకి తగిలి, ఆ జట్టు ఓటమిపాలైందని ట్రోల్ చేస్తున్నారు.
2023 సంవత్సరంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2023 నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కి వెళ్ళింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. ప్రతిసారి ఫైనల్స్ లో ఓడిపోయి, ఇంటిదారి పడుతోంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే, ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండు టైటిల్స్ గెల్చుకుంది. అలాగే ముంబై ఇండియన్స్ రెండు సార్లు ఛాంపియన్ అయింది.
🚨 JEMIMAH RODRIGUES IS BEEN TROLLED 🚨
– Why are many X handlers trolling Jemimah Rodrigues in the name of Jesus ✝️ after Delhi Capitals lost the WPL Final vs RCB 🧐
– Any Specific reason 🤔 #WPLFinal pic.twitter.com/4eKeKoISqX
— Richard Kettleborough (@RichKettle07) February 5, 2026
WPL FINAL: ఆర్సీబీ విజయం
ఢిల్లీపై బెంగళూరు జట్టు ఘన విజయం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 టైటిల్‌ని కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలుపు
స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకి… https://t.co/543JT2ospp pic.twitter.com/529hXEhg8e
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2026