E-Paper
Advertisement

ICC ODI rankings: 4 ఏళ్ల త‌ర్వాత విరాట్‌ కోహ్లీ నంబ‌ర్‌1…దారుణంగా ప‌డిపోయిన రోహిత్ శ‌ర్మ ర్యాంక్

ICC ODI rankings:  4 ఏళ్ల త‌ర్వాత విరాట్‌ కోహ్లీ నంబ‌ర్‌1…దారుణంగా ప‌డిపోయిన రోహిత్ శ‌ర్మ ర్యాంక్
Advertisement

ICC ODI rankings:  వన్డే క్రికెట్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్ లో (ICC ODI rankings) తాజాగా మొదటి స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. మొన్నటి వరకు రెండువ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీకి మొదటి స్థానం దక్కగా, రోహిత్ శర్మ మూడవ స్థానానికి పడిపోయాడు.

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

4 ఏళ్ల త‌ర్వాత విరాట్‌ కోహ్లీ నంబ‌ర్‌ 1

Advertisement

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI )  మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 11వ తేదీన ఈ వన్డే సిరీస్ ప్రారంభమైంది. అయితే ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొదటి వన్డేలో 93 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రెండో వన్డేలో కూడా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఐసీసీ తాజాగా ర్యాంకింగ్స్ (ICC ODI rankings) ప్రకటించింది. ఈ వన్డే బ్యాటర్ల ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం 785 పాయింట్లు సాధించాడు విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు విరాట్ కోహ్లీ. దీంతో నాలుగు ఏళ్ల త‌ర్వాత మొద‌టి స్థానానికి చేరుకున్నాడు విరాట్ కోహ్లీ.

అంతకు ముందు రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే రోహిత్ శర్మ రెండు వన్డేల్లో కూడా విఫలమయ్యాడు. దీంతో రోహిత్ శర్మ ( Rohit Sharma) 775 పాయింట్ల మూడో స్థానానికి దిగజారాడు. అటు న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ ఇండియా పై అద్భుతంగా రానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే 784 పాయింట్లు సాధించి రెండవ స్థానానికి దూసుకు వెళ్ళాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 785 పాయింట్లు ఉన్నాయి. దీంతో మొదటి స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత ఇబ్రహీమ్ జద్రన్ నాలుగో స్థానంలో ఉండగా టీమిండియా కెప్టెన్ గిల్ ( Gill) ఐదవ స్థానంలో నిలిచాడు. శ్రేయాస్ అయ్య‌ర్ ప‌దో స్థానంలో ఉన్నాడు. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య రాజ్ కోట్ లోని నిరంజ‌న్ షా స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది టీమిండియా. ఈ సంద‌ర్భంగా 6 ప‌రుగులు చేసిన నేప‌థ్యంలో ర్యాకింగ్స్ లో తొలి స్థానానికి చేరుకున్నాడు.

Advertisement

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

 

ICC ODI Batters Ranking

◉ Virat Kohli : 785
◉ Daryl Mitchell : 784
◉ Rohit Sharma : 775

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×