Iceland On PSL: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రేక్షకులతో మొత్తం 6 వేదికలలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, చమురు కొరత ఉన్న నేపథ్యంలో వెనక్కి తగ్గింది. ప్రేక్షకులు లేకుండానే కేవలం రెండు వేదికలలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తామని నిన్న మొహ్సిన్ నఖ్వీ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన మొహ్సిన్ నఖ్వీ చేసిన నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డ్ దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టింది. అది పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదని… ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్ ” ( Petrol Shortage League) అంటూ పోస్ట్ పెట్టి దారుణంగా ర్యాగింగ్ చేసింది. దీంతో ఐస్‌లాండ్ ( Iceland Cricket) చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఇక దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. మ్యాచ్ లు నిర్వహించడానికి డబ్బులు లేవు కానీ ఇండియా పై ఎప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏడుస్తూనే ఉంటుందని ఆడుకుంటున్నారు. ఇలాంటి పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీని ఇస్తుందా ? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంటనే PSL షెడ్యూల్ మార్చండి, లేకపోతే సంకనాకి పోతాం
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్ కు చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక మ్యాచ్ నిర్వహించాలంటే వేల లీటర్లు చమురు కావాలి. ఈ నేపథ్యంలో ఆ ఖర్చు భరించలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేతులెత్తేసింది. ఇందులో భాగంగానే కరాచీ, లాహోర్ వేదికగానే ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లను నిర్వహిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పైన ఐస్‌లాండ్ ( Iceland Cricket) దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది.
అది పాకిస్తాన్ సూపర్ లీగ్ కాదని.. ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్ ” ( Petrol Shortage League) ట్రోల్ చేస్తూ పోస్ట్ పెట్టింది ఐస్ లాండ్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ చూసేందుకు మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం.. కానీ చివరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం అందరినీ నిరాశ పరుస్తూ నిర్ణయం తీసుకుందని సెటైర్లు పేల్చింది. టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ చూద్దామనుకున్న తమకు షాక్ ఇచ్చిందని ఐస్లాండ్ క్రికెట్ బోర్డ్ ట్రోల్ చేసింది. ఆర్థిక స్థోమత లేక ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ నిర్వహించేందుకు పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందని మండిపడింది. ఇక ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ ను ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్ ” అని పిలుస్తామని ఎద్దేవా చేసింది ఐస్లాండ్ క్రికెట్ బోర్డు. దీంతో ఐస్ లాండ్ క్రికెట్ బోర్డు చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.
🚨 GLOBAL EMBARRASSMENT FOR PAKISTAN
The official X account of Iceland Cricket mocked PSL as “Petrol Shortage League.🤣
Earlier yesterday, Mohsin Naqvi announced that PSL will take place behind closed doors and at just 2 venues due to fuel crisis. pic.twitter.com/lciLNmwXIt
— Brutal Truth (@sarkarstix) March 23, 2026