E-Paper
Advertisement

Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు
Advertisement

Clash in SRH:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) మరో 6 రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీన ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అన్ని జట్లు టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్ లు కూడా ఆడేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ( Sunrisers Hyderabad team ) ప్లేయర్ల మధ్య గొడవ ( Clash in SRH) జరిగినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ పైన ( Ishan Kishan) హైదరాబాద్ ప్లేయర్ జీసన్ అన్సారీ ( Zeeshan Ansari ) తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్లు వీడియో బయటకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోస్టులు పెడుతున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Irfan Pathan On CSK: 44 ఏళ్ల ధోని డ్రెస్సింగ్ రూంలో కూర్చుంటేనే బెటర్..స‌ర్ఫ‌రాజ్ లాంటి కుర్రాళ్ల‌కు ఛాన్స్ ఇవ్వాలి

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ల మధ్య గొడవ ?

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( abrar ahmed ) కొనుగోలు చేసిన కావ్య పాప.. ఇప్పటికే దేశ ద్రోహి అనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు ఆమెకు మరో తలనొప్పి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లు ప్రాక్టీస్ మ్యాచ్ లోనే గొడవ పడ్డారు. అదిమ‌కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ తో సాధారణ బౌలర్ గొడవ పెట్టుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో తన బౌలింగ్ లో సిక్సర్లు అలాగే బౌండరీలు కొట్టినందుకుగాను ఇషాన్ కిషన్ పైన సీరియస్ అయ్యాడు హైదరాబాద్ స్పిన్నర్ జీసన్ అన్సారీ ( Zeeshan Ansari ). ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మరో 6 రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేయర్లు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు.

ఈ సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ A జట్టు తరఫున కెప్టెన్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. స్పిన్నర్ జీషన్ అన్సారీ బౌలింగ్ లో 20 పరుగులు రాబట్టాడు కెప్టెన్ ఇషాన్ కిషన్. ఆ తర్వాత చివరి బంతికి అతన్ని స్పిన్నర్ జీషన్ అన్సారీ ఔట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ ను వేలు పెట్టి చూపిస్తూ, జీషన్ అన్సారీ బండ బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇదంతా సరదాగా జరిగిన సంఘటన అని కొంతమంది అంటుంటే, ఐపీఎల్ ప్రారంభాని కంటే ముందు ఇలా గొడవ పడడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద దెబ్బ అని మరి కొంత మంది అంటున్నారు.

Advertisement

Also Read: Kohli-Charter Flight: 3 రోజులకోసారి లండ‌న్ పోతా..చార్టెడ్ ఫ్లైట్ కొనివ్వండి, RCBని టార్చ‌ర్ చేస్తోన్న విరాట్ కోహ్లీ

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×