E-Paper
Advertisement

Virat Kohli : కోహ్లీ మరో 545 పరుగులు చేస్తే చాలు.. సచిన్ రికార్డ్ బ్రేక్..!

Virat Kohli : కోహ్లీ మరో 545 పరుగులు చేస్తే చాలు.. సచిన్ రికార్డ్ బ్రేక్..!
Advertisement
Virat Kohli

Virat Kohli : భారత దేశ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులను సచిన్ టెండుల్కర్ నెలకొల్పాడు. సచిన్ రిటైర్ అయి 10 ఏళ్లు దాటింది. ఇప్పటి వరకు తను స్థాపించిన చాలా రికార్డులను విరాట్ కోహ్లీ నెమ్మదిగా సమం చేస్తూ, కొన్నింటిని దాటుకుంటూ వెళుతున్నాడు. వాటిలో మరొకటి కోహ్లీ ముందుంది.

ఇంగ్లాండ్-ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ ల్లో సచిన్ టెండుల్కర్  53 ఇన్నింగ్సుల్లో 2535 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డుపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. తనిప్పటి వరకు ఇంగ్లాండ్ పై 50 ఇన్నింగ్సు ఆడి, 1991 పరుగులు చేశాడు. జనవరి 25 నుంచి జరగనున్న ఇంగ్లాండ్ తో  ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో కోహ్లీ మరో 545 రన్స్ చేస్తే చాలు.. సచిన్ టెండూల్కర్  రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.

Advertisement

ఐదు టెస్టుల్లో మొత్తం 10 ఇన్నింగ్స్ లో తను ఉన్న ఫామ్ కి అది సాధ్యమేనని అంటున్నారు. అలాగే సెంచరీల సంఖ్య కూడా పెంచుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇప్పటికి టెస్టుల్లో 29, వన్డేల్లో 50, టీ 20లో 1 సెంచరీ మొత్తం 80 ఉన్నాయి. ఈ టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఎన్ని ఎక్కువ సెంచరీలు చేయగలిగితే అంత మంచిదని అంటున్నారు.

ఇంగ్లాండ్ కీలక ప్లేయర్ జో రూట్ ఇప్పటివరకు ఇండియాపై 9 సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అలిస్టర్ కుక్‌లు ఏడేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. కోహ్లీ 5 సెంచరీలు మాత్రమే చేశాడు.

Advertisement

సచిన్ రికార్డ్ కి కేవలం 10 పరుగుల దూరంలో జో రూట్ ఉన్నాడు. తను కూడా ఇండియా అంటే చాలు, బ్రహ్మాండంగా ఆడతాడు. ఇండియాపై తనకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ సచిన్ కోరిక ఏమిటంటే, తన రికార్డులను ఒక ఇండియన్ బ్రేక్ చేయాలి. అప్పుడే  సంతోషమని తెలిపాడు. మరి క్రికెట్ గురువుగా పేర్కొనే సచిన్ మాటను కోహ్లీ నిలబెడతాడా? లేదా చూడాల్సిందే.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×