BigTV English
Advertisement

Jharkhand | ఝార్ఖండ్ సిఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. ముఖ్యమంత్రిని ప్రశ్నించనున్న ఈడీ!

Jharkhand | భూ కుంభకోణం కేసేులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ని ప్రశ్నించడానికి ఈడీ(ENFORCEMENT DIRECTORATE) అధికారులు ఆయన అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు.

Jharkhand | ఝార్ఖండ్ సిఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. ముఖ్యమంత్రిని ప్రశ్నించనున్న ఈడీ!

Jharkhand | భూ కుంభకోణం కేసేులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ని ప్రశ్నించడానికి ఈడీ(ENFORCEMENT DIRECTORATE) అధికారులు ఆయన అధికారిక నివాసం వద్దకు చేరుకున్నారు.


ఈడీ అధికారులు ముఖ్యమంత్రిని ప్రశ్నించనున్నారనే వార్తలు రాగానే సిఎం హౌస్ వద్ద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ కారణంగా అక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేయబడ్డాయి. ముఖ్యంగా ఝార్ఖండ్ ఈడీ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం ఈ రెండు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ కేసులో ఇప్పటికే ముఖ్యమంత్రి సోరేన్‌ని విచారణ హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. సిఎంని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారని తెలియగానే ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నాయకులు, గిరిజన నాయకులు నిరసన చేపట్టారు. రాంచీలో ఒక ర్యాలీ నిర్వహించారు. దీంతో గొడవలు జరగకుండా ఉండాలని పోలీసులు 1000 మంది సెక్యూరిటీ బలగాలను సిఎం ఇంటి వద్ద మోహరించారు. సిఎం నివాసంలో గది తలుపులు మూసేసి గోప్యంగా విచారణ జరుగుతోందని సమాచారం.


హేమంత్ సోరెన్‌పై భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఇండియన్ ఆర్మీ ఆధీనంలోని 4.55 ఎకరాల భూమిని చట్ట వ్యతిరేకంగా విక్రయం జరిగిందని ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే రాంచీలోని బడగాయి అంచల్ ప్రాంత రెవెన్యూ అధికారి భాను ప్రతాప్ ప్రసాద్‌ని, 2011 బ్యాచ్ IAS ఆఫీసర్ ఛవీ రంజన్‌ని అరెస్టు చేశారు. ఈ కుంభుకోణంలో ముఖ్యమంత్రి సోరెన్ హస్తం ఉందని ఆరోపణలు ఉండడంతో ఈడీ ఆయనను విచారణ చేస్తోంది.

ఈ కేసులో ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేయగా.. ఎనిమిదో సారి ముఖ్యమంత్రి సోరేన్ స్పందించారు. జనవరి 20న విచారణకు సమయం ఇచ్చారు. మనీ లాండరింగ్, భూకుంభకోణం కేసులో ఇప్పటివరకు ఈడీ అధికారులు 10 మందిని అరెస్టు చేశారు.

Jharkhand CM, Hemant Soren, ED Questioning, Land scam case, Money Laundering, JMM Party, Jharkhand Mukti Morcha,

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×